Chief Minister: ‘ఈశాన్యం’ ప్రారంభానికి ముందే కాల్వల నిర్మాణం పూర్తి

ABN , First Publish Date - 2023-09-20T08:29:03+05:30 IST

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కాకముందే వర్షపునీటి కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)

Chief Minister: ‘ఈశాన్యం’ ప్రారంభానికి ముందే కాల్వల నిర్మాణం పూర్తి

- అధికారులకు సీఎం ఆదేశం

అడయార్‌(చెన్నై): రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కాకముందే వర్షపునీటి కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) అధికారులను ఆదేశించారు. వర్షాలకు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎం స్టాలిన్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ... గత రెండేళ్ళుగా అన్ని శాఖల సమన్వయంతో అనేక పనులను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. వచ్చే వర్షాకాలంలో కూడా ఇదే విధంగా సమన్వయంగా ముందుకు సాగి వర్షాలు, వరదల ముప్పు నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను రక్షించాలని కోరారు. గత వర్షాకాల సమయంలో గుర్తించిన వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా రూ.716 కోట్లు కేటాయించి, వివిధ రకాల పనులను పూర్తి చేశామన్నారు. ఈ కారణంగా 4399 ప్రకృతి ప్రమాదాల సంఖ్యను 3770కు తగ్గించామన్నారు. వచ్చే వర్షాకాలానికి ముందే అన్ని రకాల సహాయక సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ఐ.పెరియస్వామి, కేకేఎ్‌సఎ్‌సఆర్‌ రామచంద్రన్‌, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, ఏవీ వేలు, తంగం తెన్నరసు, అనితా రాధాకృష్ణన్‌, ఎం.సుబ్రహ్మణ్యం, ప్రభుత్వప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, డీజీపీ శంకర్‌ జీవాల్‌, చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ రాయ్‌ రాథోడ్‌, అగ్నిమాపకదళ శాఖ డైరెక్టర్‌ అభాష్‌ కుమార్‌, ప్రభుత్వ శాఖ కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T08:31:32+05:30 IST