Share News

Sabarimala:అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరులు.. రద్దీ నియంత్రించలేక పోలీసుల అగచాట్లు

ABN , Publish Date - Dec 15 , 2023 | 12:49 PM

దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శబరిమలలో(Sabarimala Temple) భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజుకి సరాసరి 80 వేల మంది భక్తులు అయ్యప్ప స్వామి(Lord Ayyappa)ని దర్శించుకుంటున్నారు.

Sabarimala:అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరులు.. రద్దీ నియంత్రించలేక పోలీసుల అగచాట్లు

తిరువనంతరపురం: దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శబరిమలలో(Sabarimala Temple) భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజుకి సరాసరి 80 వేల మంది భక్తులు అయ్యప్ప స్వామి(Lord Ayyappa)ని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయానికి వచ్చే దారులు, ప్రాంగణాలు అన్ని కిటకిటలాడుతున్నాయి.

ఆలయంలో మండల మకరవిళక్కు వేడుకలు ఈ నెల 17న ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దీంతో కొందరు క్యూలైన్లలో నిరీక్షించలేక పందళంలోని వలియకోయికల్ ఆలయానికి చేరుకుని నెయ్యి అభిషేకం చేసి వెనుదిరుగుతున్నారు.


పంబ, అపాచీకి మేడ తరువాత నుంచి శబరిపీఠం వరకూ క్యూ ఉంది. వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో భక్తులు కాలినడకన శబరికొండకు చేరుకుంటున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

రద్దీ నియంత్రణ కోసం కేవలం 1,850 మంది పోలీసులే ఉండటాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. వీరిలో 8 గంటల షిఫ్టులో 600 మందే విధులు నిర్వహిస్తున్నారు. రద్దీ పెరిగినకొద్దీ భద్రతను పెంచాల్సింది.. భద్రతను కుదించడంపై భక్తులు ప్రశ్నిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగముందే భద్రతను పెంచాలని వారు కోరుతున్నారు.

Updated Date - Dec 15 , 2023 | 02:17 PM