Bihar CM : నితీశ్ కుమార్ కాన్వాయ్ కోసం నిలిచిపోయిన రైళ్లు

ABN , First Publish Date - 2023-01-19T14:23:49+05:30 IST

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) కాన్వాయ్ నిరంతరాయంగా ప్రయాణించడం కోసం రైళ్ళను నిలిపేయడాన్ని

Bihar CM : నితీశ్ కుమార్ కాన్వాయ్ కోసం నిలిచిపోయిన రైళ్లు
Nitish Kumar

పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) కాన్వాయ్ నిరంతరాయంగా ప్రయాణించడం కోసం రైళ్ళను నిలిపేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని రైల్వే మంత్రిని కోరుతానని బీజేపీ నేత, కేంద్ర మంత్రి అశ్విని చౌబే (Ashwini Choubey) చెప్పారు.

నితీశ్ కుమార్ సమాధాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడం కోసం ఈ యాత్ర చేస్తున్నారు. ఆయన బుధవారం బక్సర్‌లోని పోలీస్ లైన్స్ నుంచి అతిథి గృహానికి వెళ్లారు. ఆయన రైల్వే క్రాసింగ్‌ను దాటి, నిరంతరాయంగా ప్రయాణించేందుకు వీలుగా, పాట్నా-బక్సర్ లోకల్ ట్రైన్, కామాఖ్య ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను ఔటర్ సిగ్నల్ వద్ద నిలిపేశారు. దీంతో ప్రయాణికులు చాలా అసహనానికి గురయ్యారు. కొందరు ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు వెళ్లి అధికారులను ప్రశ్నించారు.

బిహార్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి అశ్విని చౌబే స్పందిస్తూ, ప్రయాణికులకు జరిగిన అసౌకర్యం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని రైల్వే మంత్రిని కోరుతానని చెప్పారు.

Updated Date - 2023-01-19T14:23:53+05:30 IST