New Parliament Building: ప్రారంభోత్సవాన్ని మోదీ పట్టాభిషేకంలా భావిస్తున్నారు: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2023-05-28T16:50:02+05:30 IST

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు అంటే ప్రజావాణి అని అభివర్ణించారు. నూతన పార్లమెంటు భవాన్ని ప్రధానమంత్రి శనివారంనాడు ప్రారంభించిన కొద్ది సేపటికే రాహుల్ ఈమేరకు ఒక ట్వీట్ చేశారు.

New Parliament Building: ప్రారంభోత్సవాన్ని మోదీ పట్టాభిషేకంలా భావిస్తున్నారు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని (New parliament Inaugaration) ప్రధాని మోదీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. పార్లమెంటు అంటే ప్రజావాణి అని అభివర్ణించారు. నూతన పార్లమెంటు భవాన్ని ప్రధానమంత్రి శనివారంనాడు ప్రారంభించిన కొద్ది సేపటికే రాహుల్ ఈమేరకు ఒక ట్వీట్ చేశారు.

సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాన మంత్రి కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి ముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి 'గణపతి హోమం' నిర్వహించారు. తమిళనాడు మఠాథిపతుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పార్లమెంటు భవంతిలోని లోక్‌సభ స్పీకర్ కుర్చీ సమీపంలో రాజదండాన్ని ప్రతిష్ఠించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 20కి పైగా విపక్ష పార్టీలు బహిష్కరించాయి. రాజ్యాంగాధినేతను పిలవకపోవడం అతిపెద్ద అతిపెద్ద అవమానమని, ప్రజాస్వామ్యంపై నేరుగా జరిపిన దాడి అని విపక్షాలు విమర్శించాయి.

నియంత ధోరణి..

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పార్లమెంటు ప్రారంభోత్సవానికి దురంగా ఉంచడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మరో ట్వీట్‌లో విమర్శించారు. పార్లమెంటరీ విధివిధానాల వ్యవహారంలో నియంత ధోరణిలో వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి, తిరిగి కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా కాషాయదళాన్ని ఉసగొలుపుతున్నారని విమర్శించారు. పార్టీ ప్రధాన కాదర్శి కేసీ వేణుగోపాల్ మరో ట్వీట్‌లో కేంద్ర సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ప్రారంభోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దూరంగా పెట్టారని, రాజ్యంగబద్ధ పదవులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.

Updated Date - 2023-05-28T16:50:07+05:30 IST