Tungabhadra: ‘తుంగభద్ర’ నుంచి ఆయకట్టుకు నీటి విడుదల

ABN , First Publish Date - 2023-08-04T12:46:20+05:30 IST

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుంచి ఆయకట్టు భూములకు గురువారం నీరు విడుదల చేసినట్లు తుంగభద్ర బోర్డు నీటి సలహా సమితి తెలిపింది.

Tungabhadra: ‘తుంగభద్ర’ నుంచి ఆయకట్టుకు నీటి విడుదల

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుంచి ఆయకట్టు భూములకు గురువారం నీరు విడుదల చేసినట్లు తుంగభద్ర బోర్డు నీటి సలహా సమితి తెలిపింది. రాష్ట్రంలోని ఎల్లెల్సీ, హెచ్చెల్సీ, రాయబసవ, వివిధ కాలవలకు ఖరీఫ్‏లో సాగుకు అవసరమయిన నీటిని విడుదల చేసినట్లు బోర్డు ఈఈ తెలిపారు. ముందుగా కాలువకు డ్యాం నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేసి అనంతరం దమాషా పద్ధతిలో పెంచుతూ విడుదల చేస్తామన్నారు. కర్ణాటక(Karnataka)లో రైతులు ఎగువ, దిగువ కాలువలకు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-08-04T12:46:22+05:30 IST