China: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం...21మంది మృతి
ABN , First Publish Date - 2023-04-19T09:12:44+05:30 IST
చైనా దేశంలోని ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు....
బీజింగ్(చైనా): చైనా దేశంలోని ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు.(Fire breaks out) బీజింగ్(Beijing) నగరంలోని చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో(China hospital) జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించగా, 71మంది రోగులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు.అగ్నీకీలలు ఎగసి పడుతుండటంతో ఆసుపత్రిలో అత్యవసర ద్వారం తెరిచి రోగులను బయటకు తరలించారు.
ఇది కూడా చదవండి :Odisha: ఇద్దరు బాలురు వీధి కుక్కలను పెళ్లాడారు...ఎందుకంటే...
చైనా రాజధాని బీజింగ్‌లోని ఆసుపత్రి ఇన్‌పేషెంట్ విభాగంలోని తూర్పు విభాగంలో మంటలు చెలరేగడంతో 21 మంది మరణించారు. ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలు జరగడం చాలా అరుదు. మంటలకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఆసుపత్రిలో అగ్నిప్రమాద ఘటన అత్యంత విషాదకరమని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. అగ్నిప్రమాద సమయంలో కొందరు ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌లపై నిలబడి ఉన్నారు. మరికొందరు పై నుంచి కిందకు దూకారు.