Delhi Court : ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో న్యాయవాదుల ఘర్షణ, కాల్పులు
ABN , First Publish Date - 2023-07-05T15:17:43+05:30 IST
వాదనా పటిమతో న్యాయాన్ని గెలిపించవలసిన న్యాయవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడటం ఆందోళనకరం. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో బుధవారం న్యాయవాదుల మధ్య ఘర్షణ కాల్పుల వరకు వెళ్లింది. కోర్టు ఆఫీస్ బేరర్లు కూడా ఈ ఘర్షణలో పాల్గొన్నారు. అయితే గాలిలోకి కాల్పులు జరపడం వల్ల అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం సంభవించలేదు.
న్యూఢిల్లీ : వాదనా పటిమతో న్యాయాన్ని గెలిపించవలసిన న్యాయవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడటం ఆందోళనకరం. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో బుధవారం న్యాయవాదుల మధ్య ఘర్షణ కాల్పుల వరకు వెళ్లింది. కోర్టు ఆఫీస్ బేరర్లు కూడా ఈ ఘర్షణలో పాల్గొన్నారు. అయితే గాలిలోకి కాల్పులు జరపడం వల్ల అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం సంభవించలేదు.
నార్త్ ఢిల్లీ డీసీపీ సాగర్ సింగ్ కల్సి విడుదల చేసిన ప్రకటనలో, ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో న్యాయవాదుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు. ఈ ఘర్షణలో కోర్టు ఆఫీస్ బేరర్లు కూడా పాల్గొన్నారని చెప్పారు. న్యాయవాదుల్లో రెండు వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగిందన్నారు. వాదోపవాదాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఓ వ్యక్తి గాలిలోకి తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరిందని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని చెప్పారు.
దీనికి సంబంధించిన ఓ వీడియోను ఓ న్యాయవాది మీడియాకు ఇచ్చారు. ఓ న్యాయవాది గాలిలోకి కాల్పులు జరుపుతున్నట్లు, మరో ఇద్దరు రాళ్లు విసురుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. ఈ సంఘటనను ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ తీవ్రంగా ఖండించారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతామని చెప్పారు. ఈ తుపాకీకి లైసెన్స్ ఉందా? లేదా? పరిశీలిస్తామని తెలిపారు. లైసెన్స్ ఉన్నప్పటికీ కోర్టు లోపల, వెలుపల ఆ ఆయుధాన్ని ఉపయోగించడానికి వీల్లేదన్నారు.
ఇవి కూడా చదవండి :
Destination weddings: శివపార్వతులు సత్య యుగంలో పెళ్లి చేసుకున్న చోట పెరుగుతున్న పెళ్లిళ్లు
Quran Desecration : స్వీడన్‌లో ఖురాన్‌కు అవమానం.. పాకిస్థాన్ ప్రభుత్వం నిరసన..