Udayanidhi: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్
ABN , Publish Date - Dec 16 , 2023 | 01:48 PM
వరద సహాయ నిధి వ్యవహారంలో పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రప్రభుత్వాన్ని విమర్శించడంపై రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల
- వరద సహాయనిధిపై తమిళిసైకి ఉదయనిధి కౌంటర్
ప్యారీస్(చెన్నై): వరద సహాయ నిధి వ్యవహారంలో పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రప్రభుత్వాన్ని విమర్శించడంపై రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) తీవ్రంగా స్పందించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరామని, ఈ సాయం రాష్ట్ర గవర్నర్ రవి, కేంద్ర హోమంత్రి అమిత్‌షా అబ్బసొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. తాను పెద్దలను ఎప్పుడూ గౌరవిస్తానని, ప్రజా సంబంధిత వ్యవహారంపై ఎవరు విమర్శించినా, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. స్థానిక ముఖద్వారం ప్రాంతంలోని సముద్రంలో కలిసిన నూనెతెట్టు తొలగింపు పనులను పరిశీలించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు.