Share News

Udayanidhi: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. రాష్ట్రంపై సవతి తల్లి ధోరణిలో కేంద్రం

ABN , Publish Date - Dec 24 , 2023 | 09:53 AM

తుఫాను, వరదలతో నష్టపోయిన రాష్ట్రంపై సవతి తల్లి ధోరణిలో కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ధ్వజమెత్తారు.

Udayanidhi: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. రాష్ట్రంపై సవతి తల్లి ధోరణిలో కేంద్రం

పెరంబూర్‌(చెన్నై): తుఫాను, వరదలతో నష్టపోయిన రాష్ట్రంపై సవతి తల్లి ధోరణిలో కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ధ్వజమెత్తారు. స్థానిక బ్రాడ్‌వే సమీపంలో డాన్‌బాస్కో పాఠశాలలో శనివారం సాయంత్రం క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఉదయనిధి విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలనే రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చిందన్నారు. ఆ విషయమై తాను తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లు కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారని, తాను ఎవరినీ నిందించలేదన్నారు. వరద బాధితుకు ఇచ్చే నగదు వారు, వారి అప్ప (నాన్న) జేబుల నుంచి ఇవ్వడం లేదని, అప్ప అనే మాట తప్పుగా తాను భావించడం లేదన్నారు. వరద ప్రాంతాల ప్రజలను ఆదుకొనేలా రూ.21 వేల కోట్లు అందించాలని కేంద్రాన్ని కోరినా, ఇప్పటివరకు స్పందించలేదన్నారు. దేశంలో 9 ఏళ్లుగా బీజేపీ అధికారంలోకి రావడమే భారీ విపత్తు అని, అందువల్ల కేంద్రానికి ప్రకృతి విపత్తుల గురించి తెలియడం లేదని ఎద్దేవా చేశారు. జనాభా సంఖ్య తక్కువగా ఉన్న గుజరాత్‌కు అధికంగా నిధులు అందజేస్తున్న కేంద్రం, రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. వరద బాధితులను ఆదుకొనేలా ఆపన్న హస్తం అందించాల్సిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్‌, విపత్తులను రాజకీయం చేసి మాట్లాడడం సరికాదన్నారు. నగరంలో చేపట్టిన వర్షపు కాలువల నిర్మాణాలకు కేంద్రం ఒక్క పైసా కూడా అందించలేదని, రాష్ట్రప్రభుత్వ నిధులతోనే నిర్మాణం చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - Dec 24 , 2023 | 09:53 AM