Kali tweet: కాళీ ట్వీట్‌పై భారత్‌కు ఉక్రెయిన్ క్షమాపణలు
ABN , First Publish Date - 2023-05-02T11:33:23+05:30 IST
ఉక్రెయిన్ ఉప విదేశాంగశాఖ మంత్రి ఎమిన్ జపరోవా కాళీ దేవతపై ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్‌కు....
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ ఉప విదేశాంగశాఖ మంత్రి ఎమిన్ జపరోవా కాళీ దేవతపై ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్‌కు మంగళవారం క్షమాపణలు చెప్పారు.(Ukraine apologizes) ఈ చిత్రంపై ఆన్‌లైన్‌లో నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది దీనిని హిందువుల మనోభావాలపై ఉక్రెయిన్ దాడి అని పేర్కొన్నారు.ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పేలుడు పొగపై కాళీ దేవి(Kali tweet) చిత్రాన్ని సూపర్మోస్ చేస్తూ ఒక చిత్రాన్ని షేర్ చేసింది.‘‘కాళీ దేవతను వక్రీకరిస్తూ చిత్రీకరించినందుకు ఉక్రెయిన్ పశ్చాత్తాపపడుతోంది, ఉక్రెయిన్ భారతీయ సంస్కృతిని గౌరవిస్తుంది’’(Respects Indian culture) అని ఎమిన్ ఝపరోవా అన్నారు. ఉక్రెయిన్ చేసిన ట్వీట్ పై ఆ దేశం క్షమాపణలు చెప్పాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి :Karnataka polls: కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల...ఉచిత హామీలు
భారతదేశం నుంచి సహాయం కోరిన తర్వాత దేశంలో విస్తృతంగా ఆరాధించే దేవతను అవమానిస్తున్నారని చాలా మంది ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని నిందించారు. ఎమిన్ ఝపరోవా భారతదేశాన్ని సందర్శించిన కొద్ది రోజులకే ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ట్వీట్ వచ్చింది.ఎమీన్ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని కలిశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖను ఎమిన్ ఆమెకు అందజేశారు.