Moscow : మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. దెబ్బతిన్న రెండు భవనాలు..

ABN , First Publish Date - 2023-07-30T10:19:29+05:30 IST

రష్యా రాజధాని నగరం మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఆదివారం ఉదయం మూడు డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది. దీంతో మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాసేపు మూసేశారు. నగర శివారు ప్రాంతంలో ఓ డ్రోన్‌ను కూల్చేయగా, మరో రెండిటిని ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ దెబ్బతీసింది. ఇవి ఓ కార్యాలయం భవన సముదాయంలో కూలిపోయాయి. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు.

Moscow : మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. దెబ్బతిన్న రెండు భవనాలు..

మాస్కో : రష్యా రాజధాని నగరం మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఆదివారం ఉదయం మూడు డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది. దీంతో మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాసేపు మూసేశారు. నగర శివారు ప్రాంతంలో ఓ డ్రోన్‌ను కూల్చేయగా, మరో రెండిటిని ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ దెబ్బతీసింది. ఇవి ఓ కార్యాలయం భవన సముదాయంలో కూలిపోయాయి. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ వివరాలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఉక్రెయిన్‌ సరిహద్దుకు 500 కిలోమీటర్ల దూరంలోని మాస్కో నగరం, దాని పరిసరాల్లో ఈ ఏడాదిలో అప్పుడప్పుడు డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ దాడులను ఉగ్రవాద దాడులుగా రష్యా అభివర్ణిస్తోంది.

ఉక్రెయిన్ ఆదివారం ఉదయం తమ దేశంపై ఉగ్రవాద దాడికి పాల్పడిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మానవ రహిత గగనతల వాహనాల (UAV) ద్వారా ఈ దాడులకు పాల్పడిందని, మాస్కో నగరంలో వీటి లక్ష్యం నెరవేరకుండా అడ్డుకున్నామని తెలిపింది. ఒక ఉక్రెయిన్ యూఏవీని మాస్కో రీజియన్‌లోని ఒడింట్సోవో జిల్లాలో తమ రక్షణ వ్యవస్థలు కూల్చేశాయని తెలిపింది. మరో రెండు డ్రోన్లను తమ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ధ్వంసం చేసిందని, అవి నివాసేతర భవన సముదాయంపై పడ్డాయని వివరించింది.

మాస్కో నగర మేయర్ సెర్గీ సొబ్యనిన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో రెండు సిటీ ఆఫీస్ టవర్లు కొంత మేరకు దెబ్బతిన్నాయి. అయితే ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదు.


ఈ దాడుల నేపథ్యంలో వ్నుకోవో విమానాశ్రయాన్ని కాసేపు మూసేశారు. ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించవలసిన విమానాలను ఇతర విమానాశ్రయాలకు పంపించారు. ఓ గంట తర్వాత కార్యకలాపాలు యథాతథంగా పునఃప్రారంభమయ్యాయి.

ఈ నెలలో జరిగిన ఇటువంటి డ్రోన్ల దాడుల వల్ల ఈ విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదిలావుండగా, అమెరికా, నాటో మిత్ర దేశాలపై రష్యా విదేశాంగ శాఖ తీవ్ర ఆరోపణలు చేసింది. అమెరికా, నాటో మిత్ర దేశాల సహాయం లేకుండా ఉక్రెయిన్‌ ఈ విధంగా దాడులకు పాల్పడటం అసాధ్యమని తెలిపింది. రొస్టోవ్ రీజియన్‌లో రెండు ఉక్రెయిన్ క్షిపణులను అడ్డుకున్నట్లు రష్యా శుక్రవారం ప్రకటించింది. ఈ శిథిలాలు పడటం వల్ల టగన్రోగ్ సిటీలో 16 మంది గాయపడినట్లు తెలిపింది.


ఇవి కూడా చదవండి :

BJP state president: మణిపూర్‌ అంతా ప్రశాంతంగానే ఉందిగా..

Gujarat : అహ్మదాబాద్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 100 మంది రోగుల తరలింపు..

Updated Date - 2023-07-30T10:19:29+05:30 IST