Russian Hackers : ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌పై రష్యన్ హ్యాకర్ల దాడి
ABN , First Publish Date - 2023-03-17T13:04:08+05:30 IST
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union health ministry) వెబ్‌సైట్‌పై దాడి చేసేందుకు రష్యన్ హ్యాకర్లు ప్రయత్నించారు.
న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union health ministry) వెబ్‌సైట్‌పై దాడి చేసేందుకు రష్యన్ హ్యాకర్లు ప్రయత్నించారు. దీనిపై దర్యాప్తు జరపాలని ఈ మంత్రిత్వ శాఖ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)ను కోరింది.
CloudSEK సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను Phoenix అనే రష్యన్ హ్యాకర్ గ్రూప్ టార్గెట్ చేసింది. ఈ వెబ్‌సైట్‌లోని హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్‌ను యాక్సెస్ చేయగలిగింది. మన దేశంలోని అన్ని ఆసుపత్రులు, వాటిలో పని చేస్తున్న ఉద్యోగులు, ఫిజిషియన్ల వివరాలను తెలుసుకోగలిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో జీ20 దేశాల ఆంక్షలకు, చమురు ధరలపై పరిమితి విధించడానికి భారత దేశం అంగీకరించినందుకు ఈ డాడి చేసినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. రష్యాపై విధించిన ఆంక్షలను ఉల్లంఘించబోమని, జీ7 దేశాలు రష్యా చమురు ధరపై విధించిన పరిమితికి అనుగుణంగా వ్యవహరిస్తామని భారత దేశం అంగీకరించినందుకు ప్రతిఫలమే ఈ దాడి అని హ్యాకర్లు పేర్కొన్నారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, హ్యాకింగ్ గురించి దర్యాప్తు చేసి, వివరాలు తెలియజేయాలని CERT-Inను కోరినట్లు తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సంభవించే కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్లపై స్పందించే నోడల్ ఏజెన్సీ CERT-In. ఈ సంఘటనలపై దర్యాప్తు జరిపి, నిరోధక, ప్రతిస్పందన సేవలను అందజేస్తుంది.
ఇవి కూడా చదవండి :
weddings: భర్తలతో పాటు భార్యలకు కూడా తప్పడం లేదు..
Karnataka : బంగ్లాదేశీయుల రాకతో మన సంస్కృతికి ముప్పు : హిమంత బిశ్వ శర్మ