Uttar Pradesh : అనిల్ దుజానా కుల, మతాలు కూడా అడుగుతారా?.. ప్రతిపక్షాలకు బీజేపీ సూటి ప్రశ్న..
ABN , First Publish Date - 2023-05-04T18:26:03+05:30 IST
లక్నో : అత్యంత భయానకమైన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా (Anil Dujana) గురువారం ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో ఆయన కులం, మతం గురించి కూడా అడుగుతారా? అని ఉత్తర ప్రదేశ్ బీజేపీ ప్రశ్నించింది. 18 హత్య కేసుల్లో నిందితుడైన దుజానా ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు యూపీ ఎస్టీఎఫ్ అదనపు డీజీపీ అమితాబ్ యష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
లక్నో : అత్యంత భయానకమైన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా (Anil Dujana) గురువారం ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో ఆయన కులం, మతం గురించి కూడా అడుగుతారా? అని ఉత్తర ప్రదేశ్ బీజేపీ ప్రశ్నించింది. 18 హత్య కేసుల్లో నిందితుడైన దుజానా ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు యూపీ ఎస్టీఎఫ్ అదనపు డీజీపీ అమితాబ్ యష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠీ మాట్లాడుతూ, మాఫియా పట్ల సానుభూతి చూపే రాజకీయ పార్టీలు అనిల్ దుజానా కులం, మతం గురించి కూడా అడుగుతాయా? అని ప్రశ్నించారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నారు.
పోలీసుల కథనం..
అనిల్ దుజానాపై దాదాపు 60 కేసులున్నాయి. వీటిలో 18 హత్య కేసులు కాగా, మిగిలినవి దోపిడీలు, భూకబ్జాలు వంటివి ఉన్నాయి. యూపీ ఎస్టీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ మాట్లాడుతూ, దుజానా మీరట్‌లోని ఓ గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని తమ బృందాలు వెళ్లాయన్నారు. ఆయనను తమ బృందాలు చుట్టుముట్టాయని, అది గమనించిన ఆయన కాల్పులు ప్రారంభించారని చెప్పారు. తమ బృందాలు ప్రాణ రక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపాయని, ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
మాఫియాపై ఉక్కుపాదం
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఉత్తరప్రదేశ్‌లో 2017లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. డాన్‌లను, క్రిమినల్స్‌ను, గూండాలను, రౌడీలను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. అధికారంలోకి రాగానే శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టిపెట్టిన ఆయన గ్యాంగ్‌స్టర్స్ యాక్ట్ తీసుకొచ్చారు. దీని ప్రకారం 50 వేల మంది క్రిమినల్స్‌కు చెందిన ఆస్తులను సీజ్ చేశారు. గూండా యాక్ట్ కూడా తీసుకొచ్చారు. 2017 మార్చ్ 20 నుంచి ఇప్పటివరకూ దాదాపు 23 వేల మందిని అరెస్ట్ చేశారు. క్రిమినల్స్‌ను వేటాడే క్రమంలో 4,911 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 1,424 మంది పోలీసులున్నారు.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : ముస్లింలను కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తోంది : కర్ణాటక సీఎం