Yogi Rakhi gift: మహిళలకు రాఖీ కానుక ప్రకటించిన యోగి
ABN , First Publish Date - 2023-08-28T20:55:00+05:30 IST
రక్షాబంధన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోది ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని మహిళందరికీ 'రాఖీ' కానుక ప్రకటించారు. ఆగస్టు 30, 31 తేదీల్లో అన్ని సిటీ బస్సులలోనూ ఉచితంగా మహిళలు ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.
లక్నో: రక్షాబంధన్ (Rakshabandhan) సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోది ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రాష్ట్రంలోని మహిళందరికీ 'రాఖీ' కానుక ప్రకటించారు. ఆగస్టు 30, 31 తేదీల్లో అన్ని సిటీ బస్సులలోనూ ఉచితంగా మహిళలు ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.
రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరసోదరమణుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన తల్లులు, సోదరీమణులు, ఆడకూతుళ్లందరూ ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 31వ తేదీ మధ్యాహ్నం వరకూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఒక ట్వీట్‌లో యోగి తెలిపారు.
రక్షాబంధన్..
సోదరసోదరీమణుల మధ్య అనుబంధానికి గుర్తుగా ఏటా రక్షాబంధన్ పండుగను ఎంతో ఉత్సాహంగా దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకొంటారు. తమ్ముళ్లు, అన్నలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సోదరీమణులు రాఖీలు కడతారు. ఇందుకు ప్రతిగా వారు జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇస్తూ తమ సోదరీమణులకు కానుకలు ఇస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ శుక్ల పక్షంలోని నిండు పున్నమి రోజు రక్షాబంధన్ పండుగ జరుపుకొంటారు. ఈసారి రెండ్రోజుల పాటు 30, 31 తేదీల్లో రాఖీ వేడుకలు జరుగనున్నాయి.