Share News

Akhilesh future PM: అఖిలేష్ భావి ప్రధాని... సంచలన పోస్టర్లు

ABN , First Publish Date - 2023-10-23T16:23:35+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అంటూ లక్నోలో పోస్టర్లు వెలిసాయి. పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అఖిలేష్‌పై ఉన్న ప్రేమ, ఆదరణను కార్యకర్తలు ఈ రూపంలో చాటుకుంటున్నారని ఎస్‌పీ ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చాంద్ వివరణ ఇచ్చారు.

Akhilesh future PM: అఖిలేష్ భావి ప్రధాని... సంచలన పోస్టర్లు

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) భావి ప్రధాని అంటూ లక్నో (Lucknow)లో పోస్టర్లు వెలిసాయి. పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అఖిలేష్‌పై ఉన్న ప్రేమ, ఆదరణను కార్యకర్తలు ఈ రూపంలో చాటుకుంటున్నారని ఎస్‌పీ ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చాంద్ వివరణ ఇచ్చారు.


''జూలై 1న అఖిలేష్ పుట్టినరోజు. అయితే ఆయన బర్త్‌డేను కార్యకర్తలు పలుసార్లు చేసుకుంటూ ఉంటారు. అఖిలేష్‌పై కార్యకర్తలకు ఉన్న ప్రేమ, అభిమానం అలాంటింది. ఇవాళ అఖిలేష్ పుట్టినరోజును కొందరు కార్యకర్తలు జరుపుకొంటున్నారు'' అని హసన్ చాంద్ తెలిపారు. అఖిలేష్ ఈ దేశ ప్రధానిగా సేవలందించాలని కార్యకర్తలు ప్రార్ధనలు చేస్తున్నట్టు చెప్పారు.


'ఇండియా' కూటమి భాగస్వామిగా..

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పాటు చేసిన విపక్ష కూటమి 'ఇండియా' (I.N.D.I.A.)లో అఖిలేష్ పార్టీ (ఎస్‌పీ) భాగస్వామిగా ఉంది. 28 పార్టీలతో 'ఇండియా' కూటమి ఇటీవల ఏర్పడింది. అయితే, ఈ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంతవరకూ ప్రకటించలేదు.


కలలను అడ్డుకోలేం...

అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని కావాలంటూ సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పోస్టర్లు ఏర్పాటు చేయడంపై బీజేపీ నేత, యూపీ మంత్రి డేనేష్ అజాద్ అన్సార్ నిశిత విమర్శ చేశారు. కలలను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ఎవరైనా కలలు కొనచ్చని, అయితే, తమ సామర్థ్యాన్ని బట్టి కలలు కనాలని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోందని, దేశ ప్రజలు మోదీని బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. మోదీని మూడోసారి కూడా ప్రధానిగా ప్రజలు ఎన్నుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-23T16:23:35+05:30 IST