Vande Bharat Train: ‘వందే భారత్’ రైలు వేళల్లో మార్పులు.. 10 నిమిషాలు ముందుగా బయల్దేరనున్న ఎక్స్‌ప్రెస్
ABN , First Publish Date - 2023-10-22T11:47:09+05:30 IST
స్థానిక సెంట్రల్ నుంచి కోయంబత్తూర్‌కు వెళ్లే వందే భారత్ రైలు(Vande Bharat Train) వేళల్లో 23వ తేదీనుంచి మార్పులు చేపట్టనున్నట్టు
పెరంబూర్(చెన్నై): స్థానిక సెంట్రల్ నుంచి కోయంబత్తూర్‌కు వెళ్లే వందే భారత్ రైలు(Vande Bharat Train) వేళల్లో 23వ తేదీనుంచి మార్పులు చేపట్టనున్నట్టు దక్షిణ రైల్వే తెలిపింది. చెన్నై సెంట్రల్ నుంచి కోవైకు ప్రతిరోజు మధ్యా హ్నం 2.15 గంటలకు వందే భారత్ రైలు బయల్దేరు తుంది. ఈ రైలు సేలం - తిరుప్పూర్ మధ్య వేగం పెంచడంతో సోమవారం (ఈ నెల 23వ తేది) నుంచి 10 నిమిషాలు ముందుగా బయల్దేనుంది. ఆ ప్రకారం, సేలం కు 5.58 గంటలకు చేరుకోవాల్సి ఉండగా 5.48 గంటలకు, ఈరోడ్‌కు 6.37కు, తిరుప్పూర్‌కు 7.18 గంటలకు చేరుకుంటుంది. అలాగే, తిరుపతి - బెంగళూరు(Tirupati - Bangalore) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (నెం.22617) జోలార్‌పేటకు 10 నిమిషాలు ఆలస్యంగాను, తిరుపతి - విల్లుపురం మెమో రైలు (నెం.18853) కాట్పాడికి 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాయని అధికారులు తెలిపారు.