Share News

Vande Bharat Train: వందే భారత్‌ రైలింజన్‌లో సాంకేతిక లోపం

ABN , First Publish Date - 2023-11-17T07:32:08+05:30 IST

చెన్నై-తిరునల్వేలి(Chennai-Tirunalveli) మధ్య నడిచే వందే భారత్‌(Vande Bharat) రైలింజన్‌లో సాంకేతిలోపం తలెత్తడంతో గంట

Vande Bharat Train: వందే భారత్‌ రైలింజన్‌లో సాంకేతిక లోపం

పెరంబూర్‌(చెన్నై): చెన్నై-తిరునల్వేలి(Chennai-Tirunalveli) మధ్య నడిచే వందే భారత్‌(Vande Bharat) రైలింజన్‌లో సాంకేతిలోపం తలెత్తడంతో గంట ఆలస్యంగా బయల్దేరడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సందర్భంగా చెన్నై-తిరునల్వేలి మధ్య ప్రత్యేక వందే భారత్‌ రైలును దక్షిణ రైల్వే నడిపింది. ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకు తిరునల్వేలి నుంచి బయల్దేరాల్సి ఉండగా రైలింజన్‌లో సాంకేతికలోపం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ రైలు టిక్కెట్లన్నీ రిజర్వేషన్‌ కాగా, ప్రయాణికులు రైలులో వేచి ఉన్నారు. ఇంజనీర్లు మరమ్మతుల అనంతరం గంట 20 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 4.20 గంటలకు తక్కువ వేగంతో బయల్దేరిన రైలును కోవిల్‌పట్టి వరకు తీసుకెళ్లి, అక్కడ మళ్లీ మరమ్మతులు చేపట్టి, నిర్దేశిత వేగంతో బయల్దేరుతుందని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2023-11-17T07:32:09+05:30 IST