Vande Bharat train: ‘వందే భారత్’ ప్రత్యేక రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
ABN , First Publish Date - 2023-11-08T12:31:46+05:30 IST
దీపావళి పండుగను పురస్కరించుకొని చెన్నై ఎగ్మూర్ - తిరునల్వేలి మధ్య ‘వందే భారత్’ ప్రత్యేక రైళ్లు('Vande Bharat' special trains
పెరంబూర్(చెన్నై): దీపావళి పండుగను పురస్కరించుకొని చెన్నై ఎగ్మూర్ - తిరునల్వేలి మధ్య ‘వందే భారత్’ ప్రత్యేక రైళ్లు('Vande Bharat' special trains) నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నెం. 06067 చెన్నై ఎగ్మూర్ - తిరునల్వేలి వందే భారత్ రైలు ఈనెల 9వ తేది ఉదయం 6 గంటలకు ఎగ్మూర్‌లో బయల్దేరి మ ధ్యాహ్నం 2.15 గంటలకు తిరునల్వేలి చేరుకుంటుంది. అలాగే, నెం.06068 తిరునల్వేలి - చెన్నైర ఎగ్మూర్ వందేభారత్ ప్రత్యేక రైలు ఈనెల 9వ తేది మధ్యాహ్నం 3 గంటలకు తిరునల్వేలిలో బయల్దేరి రాత్రి 11.15 గంటలకు ఎగ్మూర్ చేరుకుంటుంది. ఈ రైళ్లు తాంబరం, విల్లుపురం, తిరుచ్చి, దిండుగల్, మదురై, విరుదునగర్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.