Vande Bharat Train: ‘వందే భారత్’ ట్రయల్ రన్ విజయవంతం
ABN , First Publish Date - 2023-09-22T11:21:46+05:30 IST
చెన్నై - తిరునల్వేలి మధ్య వందే భారత్ రైలు(Vande Bharat Train) ట్రయల్ రన్ గురువారం విజయవంతమైంది. తమిళనాట
ప్యారీస్(చెన్నై): చెన్నై - తిరునల్వేలి మధ్య వందే భారత్ రైలు(Vande Bharat Train) ట్రయల్ రన్ గురువారం విజయవంతమైంది. తమిళనాట చెన్నై - మైసూరు, చెన్నై - కోవై మధ్య వందే భారత్ రైళ్ల సేవలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో, ఈనెల 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెన్నై - నెల్లై మధ్య వందే భారత్ రైలు సేవలు ప్రారంభించనున్నారు. ఈ రైలు తొలివిడతగా తిరుచ్చి, దిండుగల్, మదురై, విరుదునగర్ స్టేషన్లలో స్టాపింగ్ ఇచ్చారు. ప్రతిరోజు తిరునల్వేలి నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1.50 గంటలకు చెన్నై చేరుకుంటుంది. చెన్నైలో మధ్యాహ్నం 2.50కి బయల్దేరి రాత్రి 10.40 గంటలకు నెల్లై చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.