Vande Barath: వందే భారత్‌ రైళ్లలో 14 నిమిషాల క్లీన్ అప్ కాన్సెప్ట్

ABN , First Publish Date - 2023-10-01T13:19:43+05:30 IST

జపాన్ బుల్లెట్ ట్రైన్(Bullet Train) స్ఫూర్తితో భారత రైల్వే అక్టోబర్ 1 నుంచి వందే భారత్ రైళ్లలో '14 నిమిషాల క్లీన్-అప్'(14 Minutes Cleanup) కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనుంది. టర్న్‌అరౌండ్ సమయాన్ని మెరుగుపరచడం, సమయపాలన దీని లక్ష్యం. ప్రతి కోచ్ ని 14 నిమిషాల్లో శుభ్రం చేయడానికి నలుగురు సిబ్బంది ఉంటారు.

Vande Barath: వందే భారత్‌ రైళ్లలో 14 నిమిషాల క్లీన్ అప్ కాన్సెప్ట్

ఢిల్లీ: జపాన్ బుల్లెట్ ట్రైన్(Bullet Train) స్ఫూర్తితో భారత రైల్వే అక్టోబర్ 1 నుంచి వందే భారత్ రైళ్లలో '14 నిమిషాల క్లీన్-అప్'(14 Minutes Cleanup) కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనుంది. టర్న్‌అరౌండ్ సమయాన్ని మెరుగుపరచడం, సమయపాలన దీని లక్ష్యం. ప్రతి కోచ్ ని 14 నిమిషాల్లో శుభ్రం చేయడానికి నలుగురు సిబ్బంది ఉంటారు.


సాధారణంగా ఈ రైళ్ల(Trains)ను శుభ్రం చేయడానికి 3 గంటల టైం పడుతుంది. దీంతో టైం వేస్ట్ అవుతుంది. దీనిని తగ్గించడానికే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వందే భారత్ రైళ్ల క్లీనింగ్ లో ఈ విధానం శాశ్వతంగా నిలిచిపోతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) అన్నారు. “అన్ని రైళ్లను నిర్దేశిత టైంలో శుభ్రం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం వందే భారత్‌ రైళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. ప్రతి కోచ్ లో నలుగురు సిబ్బందిని నియమిస్తాం. వారికి నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వడమే కాకుండా మాక్ డ్రిల్స్ కూడా ఉంటాయి” అని రైల్వే అధికారి తెలిపారు. ఆదివారం ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో వైష్ణవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Updated Date - 2023-10-01T13:19:43+05:30 IST