Viral Video: పెట్రోల్ బంక్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి
ABN , First Publish Date - 2023-06-27T10:57:54+05:30 IST
పంజాబ్‌లోని లూథియానాలో కొంతమంది వ్యక్తులు పెట్రోల్ బంకుపై దాడి చేశారు. బంక్‌ను ధ్వంసం చేసి అక్కడ పని చేసే ఉద్యోగులపై కూడా దాడి చేశారు. ఉద్యోగులను విచక్షణారహితంగా కొట్టారు. బంక్‌లోని ఆఫీస్‌పై, పెట్రోల్ యంత్రాలపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు.
పంజాబ్‌లోని లూథియానాలో కొంతమంది వ్యక్తులు పెట్రోల్ బంకుపై దాడి చేశారు. బంక్‌ను ధ్వంసం చేసి అక్కడ పని చేసే ఉద్యోగులపై కూడా దాడి చేశారు. ఉద్యోగులను విచక్షణారహితంగా కొట్టారు. బంక్‌లోని ఆఫీస్‌పై, పెట్రోల్ యంత్రాలపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే అక్కడ ఉన్న సీసీకెమెరాలో ఈ ఘటన అంతా రికార్డైంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 100 సెకన్లపైగా ఉన్న ఆ వీడియోలో పెట్రోల్ బంక్ సిబ్బందిపై వారి దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుల కోసం గాలిస్తున్నారు.
అయితే రాష్ట్రంలో పోలీసులు ఏటీఎంలు, పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,758 ఏటీఎంలు, 1,861 పెట్రోల్ పంపుల్లో.. 471 మంది పోలీసు బృందాలు, 3,000 మంది సిబ్బందితో తనిఖీలు చేశారు. మొత్తం 28 జిల్లాల్లో ఏకకాలంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల అనంతరమే లూథియానాలోని పెట్రోల్ బంక్‌పై దాడి జరగడం గమనార్హం.