Passport: వీసా, పాస్‌పోర్టు లేకుండా భారతీయులు వెళ్లే కలిగే 6 దేశాలివే!
ABN , Publish Date - Dec 26 , 2023 | 10:49 AM
మనలో చాలా మందికి జీవితంలో కనీసం ఒకసారైనా విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. విదేశాలకు వెళ్లి అక్కడి పర్యాటక ప్రదేశాలన్నింటిని చూడాలని ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు, వీసా తప్పనిసరిగా ఉండాలి. లేదంటే వెళ్లడం కుదరదు. దీంతో చాలా మంది వెళ్లలేకపోతుంటారు.
మనలో చాలా మందికి జీవితంలో కనీసం ఒకసారైనా విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. విదేశాలకు వెళ్లి అక్కడి పర్యాటక ప్రదేశాలన్నింటిని చూడాలని ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు, వీసా తప్పనిసరిగా ఉండాలి. లేదంటే వెళ్లడం కుదరదు. దీంతో చాలా మంది వెళ్లలేకపోతుంటారు. పాస్‌పోర్టు, వీసా సంపాదించడం కాస్త కష్టంతో కూడుకున్నది కాబట్టి చేసేదేమి లేక తమ కోరికను చంపేసుకుంటారు. అలాంటి వారికి ఒక శుభవార్త. మన దగ్గర ఎలాంటి వీసా, పాస్‌పోర్టు లేకపోయినప్పటికీ కొన్ని రోజులు విదేశాల్లో ఉండి రావొచ్చు. అక్కడి పర్యాటక ప్రదేశాలన్నింటిని చూసేయచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అన్ని దేశాల్లో కుదరదు. ఒక 6 దేశాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ దేశాల్లో భారతీయులు 30 రోజులపాటు ఎలాంటి వీసా, పాస్‌పోర్టు లేకుండా తిరగొచ్చు. భారత్ నుంచి వచ్చే పర్యాటకులు ఎక్కువగా ఉండడంతో తమ పర్యాటక ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఆయా దేశాలు భారతీయులకు ఈ వెసులుబాటును కల్పించాయి. అయితే ఆ దేశాలు ఏమిటి? అక్కడ చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ఏమిటి? అనే విషయాల గురించి ఒకసారి పరిశీలిద్దాం.
ఇండోనేషియా
మీరు ఎప్పటినుంచే ఇండోనేషియా వెళ్లాలని అనుకుంటే మీకు ఇది మంచి అవకాశం. ఎలాంటి వీసా, పాస్‌పోర్టు లేకుండా భారతీయులు 30 రోజులపాటు ఇండోనేషియాలో ఉండొచ్చు. ఇండోనేషియాలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు సుమత్రా, జావా, బాలి దీవులున్నాయి.
థాయిలాండ్
ఈ ఏడాది నవంబర్‌లో భారతీయ పర్యాటకులకు థాయిలాండ్ వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. దేశంలోని పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో థాయిలాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తోపాటు చైనా, మరికొన్ని దేశాల పౌరులకు కూడా థాయిలాండ్ ప్రభుత్వం వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇది శాశ్వతంగా కాదు. ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది 10 మే 2024 వరకు మాత్రమే. ఈ మధ్య కాలంలో వీసా లేకుండా 30 రోజులపాటు భారతీయులు థాయిలాండ్‌లో ఉండొచ్చు. కాగా థాయిలాండ్‌లో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు గ్రాండ్ ప్యాలెస్, ఖావో యాయ్ నేషనల్ పార్క్.
మలేషియా
పర్యాటకానికి మలేషియా మంచి ప్రదేశం. వీసా లేకుండా ఇక్కడ కూడా భారతీయులు 30 రోజులపాటు ఉండొచ్చు. మలేషియా పురాతన బహుళ సాంస్కృతిక జీవనానికి ప్రసిద్ధి చెందింది. మలేషియా ఐకానిక్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ చారిత్రాత్మకమైవని. పర్వతాలు, బీచ్‌లు, వన్యప్రాణులు, అడవులలో పర్యాటకులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మలేషియా ఆహారాన్ని కూడా పర్యాటకులు చాలా ఇష్టపడుతుంటారు. మలేషియాలో చూడాల్సిన ప్రదేశాలు పెట్రోనాస్ ట్విన్ టవర్స్, బటు గుహలు, లెగోలాండ్.
వియత్నాం
ఆసియాలోనే అతిపెద్ద గుహలు వియత్నాంలో ఉన్నాయి. ఇక్కడి ద్వీపాలు, అడవులు, మతపరమైన ప్రదేశాలు, అనేక అందమైన వస్తువులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి పాలరాతి పర్వతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వియత్నాం స్ట్రీట్ ఫుడ్‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. స్ట్రీట్ ఫుడ్స్‌ల్లో రైస్ నూడిల్ సూప్, బియ్యంతో చేసిన వివిధ వంటకాలను ఆస్వాదించవచ్చు. వీసా లేకుండా ఇక్కడ కూడా 30 రోజులపాటు ఉండవచ్చు. ఇక వియత్నాంలో చూడవలసిన ప్రదేశాలు కుచి టన్నెల్, టెంపుల్ ఆఫ్ లిటరేచర్, వార్ రిమ్నెంట్స్ మ్యూజియం ఉన్నాయి.
మాల్దీవులు
కొత్తగా పెళ్లైన జంటలకు అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో మాల్దీవులు ఒకటి. ఇక్కడి అందమైన దృశ్యాలు చూపరులను కనువిందు చేస్తాయి. మాల్దీవులలో పర్యాటకుల కోసం లెక్కలేనన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే సీబీచెస్ దృశ్యం చాలా ప్రత్యేకమైనది. ఇది కాకుండా మగ అటోల్, సన్ ఐలాండ్, బనానా రీఫ్, అలిమత ద్వీపం, బయోలుమినిసెంట్ బీచ్, ఆర్టిఫిషియల్ బీచ్, బరస్ ద్వీపం కూడా సందర్శించవచ్చు. ఇక్కడ కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం మాఫుషి బీచ్. వీసా లేకుండా మాల్దీవుల్లో కూడా నెల రోజుపాటు ఉండవచ్చు.
నేపాల్
నేపాల్ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. నేపాల్‌లో పర్యాటకులు హిమాలయాలు, పచ్చని అడవులు, రోలింగ్ కొండలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎవరెస్ట్ శిఖరంతో సహా ప్రపంచంలోని ఎనిమిది ఎత్తైన శిఖరాలు నేపాల్‌లోనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు నేపాల్‌కు బౌద్ధ విహారాలను చూసేందుకు వెళ్తుంటారు. ఇక్కడ కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు పశుపతినాథ్ ఆలయం, బౌద్ధ స్థూపం, స్వయంభూ మహాచైత్యం ఉన్నాయి. ఇక్కడికి వెళ్లాలంటే భారతీయులకు ఎలాంటి వీసా, పాస్ పోర్టు అవసరం లేదు.