Voters: పార్టీల నేతల్ని నిలదీస్తున్న ఈరోడ్‌ తూర్పు ఓటర్లు?!

ABN , First Publish Date - 2023-03-12T12:28:13+05:30 IST

ఈరోడ్‌ ఈస్ట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు ముగిసి వారం దాటినా ఆ నియోజకవర్గంలోని వివిధ పార్టీల నేతల్ని ఓటర్లు గట్టిగా

Voters: పార్టీల నేతల్ని నిలదీస్తున్న ఈరోడ్‌ తూర్పు ఓటర్లు?!

చెన్నై: ఈరోడ్‌ ఈస్ట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు (East Assembly by-elections) ముగిసి వారం దాటినా ఆ నియోజకవర్గంలోని వివిధ పార్టీల నేతల్ని ఓటర్లు గట్టిగా నిలదీస్తున్నారు. ఆ ఎన్నికల్లో తమ అభ్యర్థికే ఓటేయాలంటూ పలు పార్టీల నేతలు పోలింగ్‌కు ముందు రోజు ఇంటింటికీ తిరిగి టోకెన్లు పంచిపెట్టారు. డబ్బులు చేతు ల్లో పెట్టుకుని తిరిగితే ఎన్నికల కమిషన్‌ అధికారులు పట్టుకునే అవకాశమున్నందున తాము టోకెన్లు ఇస్తామని, పోలింగ్‌ ముగిసిన మూడోనాడు ఆ టోకెన్‌ తీసుకొస్తే తగిన బహుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాంటి టోకెన్లకు కొంతమంది డబ్బు, మరికొంతమంది కుక్కర్‌, మిక్సీ, గ్రైండర్‌ వంటి వాటిని కూడా ఇస్తామని ఆశ చూపారు. అయితే ఎన్నికలు ముగిసి వారం దాటినా ఇప్పటి వరకూ ఆ టోకెన్లకు మోక్షం కలగలేదని అక్కడి ఓటర్లు రగిలిపోతున్నట్లు తెలిసింది. దీనిపై టోకెన్లు ఇచ్చిన వారిని నిలదీస్తున్నట్లు సమాచారం. అయితే తమ నేతలు చెప్పినట్లుగానే తాము టోకెన్లు పంపిణీ చేశామని, వాటితో తమకెలాంటి సంబంధం లేదని ఆయా జారుకుంటుండడంతో ఓటర్లు డైలమాలో పడిపోయినట్లు తెలుస్తోంది. దాంతో ఈసారి ఓట్ల కోసం వచ్చే వారిని దులిపిపారేయాలని కొంతమంది ఓటర్లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

Updated Date - 2023-03-12T12:37:01+05:30 IST