Weather : ఉత్తరాంధ్ర, తెలంగాణ, అస్సాం, ఒడిశా, కొంకణ్, మలబార్ తీరాలకు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2023-07-26T10:58:27+05:30 IST

రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతాలు, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, యానాంలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Weather : ఉత్తరాంధ్ర, తెలంగాణ,  అస్సాం, ఒడిశా, కొంకణ్, మలబార్ తీరాలకు భారీ వర్ష సూచన

న్యూఢిల్లీ : రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతాలు, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, యానాంలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కొరైకల్, కేరళలలో కూడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని సూచించింది.


కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్ర, కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అస్సాం, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, దీనికి సమీపంలోని తూర్పు మహారాష్ట్ర, కొంకణ్, మలబార్ తీరాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఈశాన్య భారతంలో ఉరుములు, మెరుపులతో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, జమ్మూ-కశ్మీరు, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.


బిహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలు :

- తెలంగాణ, తూర్పు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కొంకణ్ తీరంలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, జమ్మూ-కశ్మీరు, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో విస్తారంగా వర్షాలు కురియవచ్చు. అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.


- బిహార్, తమిళనాడు, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో చెదురు మదురు వర్షాలు కురియవచ్చు.

రానున్న ఐదు రోజులకు వాతావరణ సూచన :

రుతు పవనాల ప్రభావం రానున్న రెండు, మూడు రోజుల్లో క్రమంగా పశ్చిమం నుంచి ఉత్తర దిశకు మారే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో పశ్చిమ-మధ్య, దాని పక్కనే ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా దక్షిణ దిశగా కదిలే అవకాశం ఉంది. ఇది నెమ్మదిగా వాయవ్య దిశగా కదిలి ఒడిశా తీరాన్ని రెండు, మూడు రోజుల్లో దాటే అవకాశం ఉంది. ఇది క్రమంగా వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది తుపానుగా మారే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు.

మొత్తం మీద రానున్న కొన్ని రోజులపాటు తూర్పు, మధ్య భారతంలో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. మరోవైపు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలుల వల్ల కొంకణ్, మలబార్ తీరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చు.


ఇవి కూడా చదవండి :

Khushboo: వెనక్కి తగ్గారు.. ఖుష్బూ ట్వీట్‌.. ఆనక తొలగింపు.. అసలు విషయమేంటంటే..

Infosys Foundation : సుధా మూర్తి ఆహారపు అలవాట్లపై దుమారం

Updated Date - 2023-07-26T10:58:27+05:30 IST