Election Result 2023 : ఈశాన్యంలో కాషాయం రెపరెపలకు కారణాలివేనా?
ABN , First Publish Date - 2023-03-02T15:59:31+05:30 IST
హిందుత్వానికి పెద్ద పీట వేసే భారతీయ జనతా పార్టీ (BJP) ఈశాన్య రాష్ట్రాల్లో విజయ పరంపరను కొనసాగించడానికి కారణాలేమిటి?
న్యూఢిల్లీ : హిందుత్వానికి పెద్ద పీట వేసే భారతీయ జనతా పార్టీ (BJP) ఈశాన్య రాష్ట్రాల్లో విజయ పరంపరను కొనసాగించడానికి కారణాలేమిటి? అస్సాం, త్రిపుర హిందూ మెజారిటీ రాష్ట్రాలు అయినప్పటికీ, గిరిజనులు, క్రైస్తవులు అధికంగా ఉండే మేఘాలయ, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో ఈ పార్టీ ఎలా పాగా వేయగలుగుతోంది? గతంలో పడిన బీజాలు ఇప్పుడు ఫలాలను ఇస్తున్నాయా? విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే...
అటల్ బిహారీ వాజ్‌పాయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్రాల ప్రజల్లో బీజేపీ పట్ల సుహృద్భావం అప్పటి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. పాత ప్రాజెక్టులను వేగవంతం చేయడంతోపాటు కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తుండటం వల్ల బీజేపీ పట్ల ప్రజలు మరింత ఆకర్షితులవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా నిధులు కుమ్మరిస్తుండటం వల్ల మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఆ పార్టీకి కలిసొచ్చింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో ఏర్పాటైన నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలయెన్స్ ద్వారా స్థానిక నేతలతో సత్సంబంధాలను పెంచుకోవడం కూడా కాషాయ జెండా రెపరెపలకు దోహదపడింది.
ఇవి కూడా చదవండి :
Bypolls 2023 Results : కమల్ హాసన్ మద్దతిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి ఏంటంటే...!