Nirmala Sitharaman: ముస్లింలపై నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలపై రాజుకున్న రచ్చ...ఒవైసీ కౌంటర్...అసలు అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే...
ABN , First Publish Date - 2023-04-12T13:57:12+05:30 IST
భారతదేశంలో ముస్లింల పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి...
హైదరాబాద్ : భారతదేశంలో ముస్లింల పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.(Nirmala Sitharaman comments) పాకిస్థాన్ దేశంలో కంటే భారతదేశంలో ముస్లింలు(Muslims) ఎంతో మెరుగైన జీవనం గడుపుతున్నారని కేంద్ర వ్యాఖ్యానించడంతో కొత్త చర్చకు దారితీసింది. పాకిస్థాన్ దేశంలోనే మైనారిటీల సంఖ్య రోజురోజుకు తగ్గుతుందని, వారి పరిస్థితి దిగజారుతుందని మంత్రి ఆరోపించారు. భారతదేశంలో ముస్లింలపై వివక్ష, దాడులు జరుగుతున్నాయని పాశ్యాత్య పత్రికల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మంత్రి చెప్పారు. ముస్లింల జనాభాలో భారత్ రెండో స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు.వాషింగ్టన్ నగరంలో పీటర్సన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు స్వేచ్ఛగా జీవిస్తూ హాయిగా వ్యాపారాలు చేసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.
కేంద్రమంత్రి వ్యాఖ్యలను ఖండించిన ఒవైసీ
ముస్లింలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. దేశంలో ముస్లిం జనాభా క్షీణిస్తుందని ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. హిందూత్వవాదులు మారణహోమం సృష్టిస్తున్నారని, ఆయుధాలు చేతపట్టాలని హిందూ నేతలు కోరుతున్నారని అసద్ గుర్తు చేశారు. మహారాష్ట్రంలోనే 50 ప్రాంతాల్లో ముస్లిం వ్యతిరేక ర్యాలీలు జరిగాయని ముస్లింల ఇళ్లపై బుల్లోజర్లు పంపడం, హించించడం జరుగుతుందని ఒవైసీ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మైనారిటీల బడ్జెట్ లో 40 శాతం కోత విధించిందని, మౌలానా ఆజాద్ ఫెలోషిప్, పేద విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లను తగ్గించారని ఒవైసీ ఆరోపించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలు ఎవరేం చెప్పినా వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే ముస్లింల స్థితిగతులు బాగా లేవని తేటతెల్లం అవుతుంది.దేశంలో ముస్లింల ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదని ఎన్ఎస్ఎస్ఓ లేబర్ ఫోర్స్ సర్వేలో వెల్లడైంది.
ఇది కూడా చదవండి : Covid cases: దేశంలో కరోనా కేసుల కలకలం...పెరుగుతున్న పాజిటివిటీ రేటు
విద్యలో ముస్లింలో అందరికంటే వెనుకంజలో ఉన్నారని తేలింది. పట్టణ ప్రాంతాల్లో ముస్లిం పురుషుల్లో ప్రతీ 1000మందిలో 15 మంది పోస్టుగ్రాడ్యుయేట్లే ఉన్నారని సర్వే తెలిపింది. విద్యలో ముస్లింలు హిందువులు, క్రైస్తవులు, సిక్కుల కంటే నాలుగు రెట్లు తక్కువ అని అధ్యయనాల్లో తేటతెల్లమైంది. సెకండరీ, ఉన్నత విద్యలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీనికితోడు తలసరి ఆదాయంలో ముస్లింలు వెనుకంజలోనే ఉన్నారు. ముస్లింలలో ఎక్కువ మంది పేదరికంలోనే మగ్గుతున్నారని పలు నివేదికలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి : First Rapid Rail: ఢిల్లీ-మీరట్ మొట్టమొదటి రాపిడిక్స్ రైలు...ఎన్‌సీఆర్‌టీసీ ప్రకటన
విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా ముస్లింలు వివక్షకు గురవుతున్నారని పలువురు మేధావులు ఆరోపించారు. ముస్లింల వెనుకబాటుతనంపై పలు నివేదికలు వెల్లడిస్తున్నా, కేంద్రమంత్రి ముస్లింల జీవనం దేశంలో మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత దేశంలో 200 మిలియన్ల మంది ముస్లింలు నివసిస్తుండగా, వారిలో అధిక భాగం విద్య, ఉద్యోగాలు, రాజకీయ అధికారంలో వెనుకబడి ఉన్నారు. జస్టిస్ సచార్, జస్టిస్ రంగనాథ్ మిశ్రా రిపోర్టుల్లోనూ దేశంలో ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తేలింది.