Kedarnath: కేదార్‌నాథ్‌లో అపచారం.. శివలింగంపై ఇలా నోట్లు చల్లడం ఏంటో..!

ABN , First Publish Date - 2023-06-19T18:14:38+05:30 IST

హిందువులు పవిత్రంగా భావించే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. గర్భగుడిలో ఉండే శివలింగంపై (Shivling) ఓ మహిళా భక్తురాలు కరెన్సీ నోట్లు (Currency Notes) చల్లుతూ తన్మయత్వంతో నృత్యం చేస్తూ కనిపించింది. ఆమె పక్కన ఉన్న భక్తులు కూడా ఆమెను ఆపకపోగా ప్రోత్సహించారు.

Kedarnath: కేదార్‌నాథ్‌లో అపచారం.. శివలింగంపై ఇలా నోట్లు చల్లడం ఏంటో..!

ఉత్తరాఖండ్‌: హిందువులు పవిత్రంగా భావించే ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) కేదార్‌నాథ్ ఆలయంలో (Kedarnath Temple) అపచారం చోటు చేసుకుంది. గర్భగుడిలో ఉండే శివలింగంపై (Shivling) ఓ మహిళా భక్తురాలు కరెన్సీ నోట్లు (Currency Notes) చల్లుతూ తన్మయత్వంతో నృత్యం చేస్తూ కనిపించింది. ఆమె పక్కన ఉన్న భక్తులు కూడా ఆమెను ఆపకపోగా ప్రోత్సహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివలింగంపై కరెన్సీ చోట్లు చల్లిన మహిళపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మహిళ ఎవరనే వివరాలు ఇంకా తెలియలేదు.

SS__95_.webp

నిజానికి కేదార్‌నాథ్ ఆలయం లోపల వీడియోలు తీయడం కానీ, ఫోటోలు తీయడం కానీ నిషేధం. అలాంటిది ఒక స్త్రీ అవమానకర రీతిలో శివలింగంపై కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తూ అనుచితంగా ప్రవర్తించింది. బార్ లేదా పెళ్లి ఫంక్షన్‌లో మాదిరిగా డ్యాన్స్‌లు చేస్తూ శివయ్యపై నోట్లు చల్లడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై శ్రీ బద్రీనాథ్- కేదార్‌నాథ్ ఆలయ కమిటీ డాక్యుమెంట్ రూపంలో అధికారికంగా ఒక ప్రెస్ నోటును విడుదల చేసింది. దాని ప్రకారం వైరల్ అయిన వీడియోను ఆలయ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనికి సంబంధించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్‌తో అజయ్ మాట్లాడినట్లు ప్రెస్ నోటులో పేర్కొన్నారు.

Updated Date - 2023-06-19T18:17:16+05:30 IST