'XPB' virus: రాష్ట్రంలో ‘ఎక్స్‌పీబీ’ వైరస్ వ్యాప్తి
ABN , First Publish Date - 2023-03-31T08:36:14+05:30 IST
రాష్ట్రంలో నిర్ధారణ అయిన కరోనా నమూనాల్లో 83.6 శాతం ఎక్స్‌పీబీ రకం వైరస్('XPB' virus) లక్షణాలని ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా
- ఆరోగ్యశాఖ వెల్లడి
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో నిర్ధారణ అయిన కరోనా నమూనాల్లో 83.6 శాతం ఎక్స్‌పీబీ రకం వైరస్('XPB' virus) లక్షణాలని ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఫిబ్రవరి రెండవ వారం నుంచి మార్చి నెల వరకు సేకరించిన 144 నమూనాలను పరిశోధనలు పంపగా, వాటిలో 83.6 శాతం ఎక్స్‌పీబీ రకానికి చెందినవిగా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో గత సెప్టెంబరు ఎక్స్‌పీబీ కరోనా నిర్ధారణ కాగా, ఇప్పటివరకు 13 సార్లు రూపాంతరం చెందిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఎక్స్‌పీబీ వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన అవసరం లేనందున ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది.