Summer: వేసవిలో దద్దుర్లు పోవాలంటే.. ఇలా చేసి చూడండి..!
ABN , First Publish Date - 2023-04-14T15:58:31+05:30 IST
తులసి చమట పొక్కుల నుంచి ఆచికాకు, ఎరుపు, వాపును తగ్గిస్తుంది
వేసవిలో చెమటకు వేడి దద్దుర్లు శరీరంమీద కనిపించడం మామూలే. అయితే ఈ సమస్య చాలా తీవ్రతరం అయితే మాత్రం దీనికి చికిత్స తప్పనిసరి. ఇది చర్మం పై పొరలలో చెమట ఏర్పడటానికి దారితీస్తుంది. నాళాల చీలికలు, అధిక చెమట, బ్యాక్టీరియా ఇతర కారకాల వల్ల ఈ అడ్డంకులు ఏర్పడతాయి. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం కూడా ఈ సమస్యకు దారి తీస్తుంది. ఈ దద్దుర్లు తగ్గాలంటే కొన్ని ఆయుర్వేద చిట్కాలు తప్పనిసరి. అవేంటంటే..
1. గంధపు పొడిని కొద్దిగా నీళ్లలో కలిపి దద్దుర్లు ఉన్న చోట రాస్తే వేడి దద్దుర్లతో కూడిన మంట, బాధాకరమైన అనుభూతి తగ్గుతుంది. మందపాటి పేస్ట్ చేయడానికి 2 భాగాల గంధపు పొడిని 1 భాగం నీటితో కలపండి. శరీరం మీద పైపూతగా రాస్తే ఉపశమనం కలుగుతుంది.
2. అలోవెరా జెల్ ఎక్స్‌ట్రాక్ట్‌లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ చర్యలను ఇస్తాయి, ఇవి వేడి దద్దుర్లు, లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తాజాగా తీసిన కలబంద జెల్‌ని తీసుకుని, మసాజ్ చేయండి.
ఇది కూడా చదవండి: చాలామంది పొద్దునే లేవగానే తుమ్ముతుంటారు! ఛీఛీ ఇదేంట్రా అని పక్కనోళ్లు అనుకుంటారు.. కానీ ఇందుకు కారణాలు ఏంటో తెలుసా...
3. ముల్తానీ మిట్టి అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పిల్లల్లో, పెద్దలలో వేడి దద్దుర్లు ఉపశమనానికి సహాయపడుతుంది. ½ టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టిని నీటితో కలపండి, పేస్ట్ లాగా చేయండి. శరీరం అంతటా పూసి 10 నిమిషాలు ఉంచి కడగండి.
4. తులసి చమట పొక్కుల నుంచి ఆచికాకు, ఎరుపు, వాపును తగ్గిస్తుంది, మంటను, వేడి దద్దుర్లతో సంబంధం ఉన్న దురదను తగ్గిస్తుంది. కొన్ని తులసి ఆకులను తేనెతో గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి దద్దుర్లు ఉన్న చోట రాయండి.
5. వేడి వల్ల వచ్చే దద్దుర్లు నివారించడానికి, చల్లగా, పొడిగా ఉండండి. వదులుగా, గాలి తగిలే దుస్తులను ధరించడం, టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం, తరచుగా చల్లటి పానీయాలు తీసుకోవడం హైడ్రేటెడ్‌గా ఉండటం ద్వారా అధిక చెమటను నివారించవచ్చు.