Infant: మీ పిల్లలకి తల్లి పోలిక కాకుండా తండ్రి పోలిక వచ్చిందా..? అలాంటి తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్ అండీ బాబూ..!
ABN , First Publish Date - 2023-02-22T12:27:22+05:30 IST
పిల్లలు తమ తల్లిదండ్రులిద్దరితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారు.
తల్లిదండ్రుల స్పర్శ బిడ్డలకు మంచిదంటారు పెద్దలు, అయితే బిడ్డల పెరుగుదలలో తల్లిపాత్ర ఎంత ఉంటుందో తండ్రి ప్రాముఖ్యత కూడా అంతే ఉంటుంది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, తండ్రి పోలికలతో అచ్చంగా అలానే పుట్టే శిశువు ఆరోగ్యంగా ఉంటాడని చెపుతుంది. అదెలాగంటే.. తండ్రి దగ్గరితనం మొదటి సంవత్సరంలో శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట.
వాస్తవానికి, పిల్లలు తమ తల్లిదండ్రులిద్దరితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, కానీ ఈ అధ్యయనంలో తండ్రి ప్రమేయం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొన్నారు. వారి తండ్రితో సన్నిహితంగా ఉండే పిల్లలు తండ్రి లేని పిల్లల కంటే సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందారట.
శిశువు, నాన్నల మధ్య శారీరక పోలిక అవసరమా?
పిల్లల పెరుగుదలలో తల్లి పాత్రతో పాటు తండ్రి సమక్షం కూడా అంతే అవసరం ఇది పిల్లల పెరుగుదలలో అత్యంత కీలకంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నమాట.. శిశువు తండ్రి నుండి సంరక్షణలో ఆరోగ్యవంతంగా పెరిగేలా చేస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం, తల్లులతో మాత్రమే పెరిగే పిల్లలు సుమారు 700 కుటుంబాలను పరిశీలించినపుడు. ఎక్కువ సమయం పిల్లలలో ఆరోగ్యపరంగా పెరుగుదల బావున్నట్టుగా కనుగొన్నారు.
తండ్రితో గడిపిన సమయం పిల్లల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, తండ్రులు తమ పిల్లలను తల్లిదండ్రుల తరగతులు, ఆరోగ్య విద్య, ఉద్యోగ శిక్షణ ద్వారా సంపాదనను పెంపొందించుకోవడం ద్వారా తరచుగా నిమగ్నమయ్యేలా ప్రోత్సహించడానికి గొప్ప ప్రయత్నాలు చేయవచ్చు.
న్యూ డాడ్ బాధ్యతలు, అంచనాలు
తండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి కారణాలతో సంబంధం లేకుండా, ఆ సమయం చాలా కీలకం. తల్లిదండ్రులిద్దరూ బాధ్యతలను పాలుపంచుకున్నప్పుడు, పిల్లలకు శారీరకంగా, మానసికంగా ఎక్కువ పెనవేసుకుపోతారు. ఎక్కువ సమయం వారితో కలిపి గడపడం వల్ల పిల్లల్లో ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుందట. ఈ బిజీ కాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ బిజీగానే గడుపుతున్నారు. అయితే వారిలో ఎందరు రోజులో పిల్లలతో గడుపుతున్నారు. మనమే లెక్కతేల్చుకోవాలి.