Share News

Foods: ఆరోగ్యానికి మంచిదని తినేస్తాం కానీ ఈ ఏడు పదార్థాలు తీసుకుంటే...!!

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:04 PM

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. అలవాట్లను మార్చుకోవాలి. ఇందులో భాగంగా మనం రోజువారి తీసుకునే ఆహారంలో పోషకాలున్నవి ఎంచుకుంటాం. అయితే అన్ని పదార్థాలు ఆరోగ్యాన్ని పెంచుతాయని లేదు.

Foods: ఆరోగ్యానికి మంచిదని తినేస్తాం కానీ ఈ ఏడు పదార్థాలు తీసుకుంటే...!!
Food Items

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. అలవాట్లను మార్చుకోవాలి. ఇందులో భాగంగా మనం రోజువారి తీసుకునే ఆహారంలో పోషకాలున్నవి ఎంచుకుంటాం. అయితే అన్ని పదార్థాలు ఆరోగ్యాన్ని పెంచుతాయని లేదు.

గ్రానోలా బార్లు..

గ్రానోలా బార్ వీటిని ఆరోగ్యాన్ని పెంచే చిరుతిండిగా విక్రయిస్తూ ఉంటారు. వీటిని తృణధాన్యాలు, గింజలతో కలిపి తయారు చేస్తారు. అయితే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని తినే ముందు చక్కెర కేలరీలతో పాటు, ఇందులో వాడే పదార్థాల జాబితా, పోషకాహారాల లిస్ట్‌ను కూడా తెలుసుకోవడం ముఖ్యం.

పెరుగు..

పెరుగును అధికంగా తీసుకుంటూ ఉంటాం. భోజనం తర్వాత పెరుగన్నం తినడం అలవాటుగా వస్తుంది. పెరుగులో కాల్షియం అధికంగా ఉంది. ముఖ్యంగా పెరుగులో ప్యాకింగ్ విధానంలో వచ్చే పెరుగు, అనేక రకాలైన చక్కెరలు, కృత్రిమ రుచులతో నిండి ఉంటుంది. దీనిని తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరం.

పండ్ల రసాలు..

పండ్లతో తయారు చేసిన తాజా పండ్ల రసం శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. అయితే వాణిజ్యంగా సీల్డ్ ప్యాకింగ్ పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు. ఇది చక్కెరను అధికంగా కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎలాంటి మేలును అందించవు.

వేరుశనగ వెన్న..

వేరుశనగ వెన్న ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, పోషకాల మూలం. అలా అని ఈ వెన్న అంతా ఒకేలా తయారుచేయబడదు. ఈ వాణిజ్య రకాల్లో చక్కెరలు, హైడ్రోజనేటెడ్ నూనెలు, అధిక ఉప్పు ఉంటుంది. మామూలుగా వెరుశనగ వెన్నలో ఉప్పుతో సహా తక్కువ పదార్థాలతో సహజమైన వేరుశెనగ వెన్నని ఎంచుకోవడం ముఖ్యం.

ఇది కూడా చదవండి: గంగవల్లి కూరను శీతాకాలంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటంటే...!!


డైట్ సోడా..

డైట్ సోడాలు తరచుగా చక్కెర, కేలరీలు లేకపోవడం వల్ల సాధారణ సోడాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ప్రచారం చేస్తారు. అయితే, డైట్ సోడాల్లోని కృత్రిమ స్వీటెనర్లు గట్ బ్యాక్టీరియా, జీవక్రియ ప్రక్రియలను ప్రభావితం చేయడంతో సహా ఆరోగ్య ప్రమాదాలను కలిగించవచ్చు.

వెజ్జీ చిప్స్..

సాంప్రదాయ బంగాళాదుంప చిప్స్‌కు, వెజ్జీ చిప్స్ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా అనిపించవచ్చు, నిజం ఏమిటంటే అవి ప్రాసెసింగ్‌ చేసి తయారుచేస్తారు. ఇది పోషకాల నష్టానికి దారితీస్తుంది. దీనికి తోడు వండే పద్ధతులు, ఇందులో కలిపే మసాలాలు, అధిక సోడియం కంటెంట్‌ అనారోగ్యానికి దారితీస్తాయి.

డైజెస్టివ్ బిస్కెట్లు..

పేరులోని 'డైజెస్టివ్' అనే పదం కారణంగా తరచుగా 'ఆరోగ్యకరమైన' చిరుతిండి అనుకుని వీటిని తింటూ ఉంటారు కానీ, ఈ బిస్కెట్లు అంత ప్రభావవంతంగా పనిచేయవు. గోధుమలు లేదా వోట్ పిండిని కలిపి తయారుచేయవచ్చు కానీ.. శుద్ధి చేసిన పిండికి చక్కెరలను కలిగి తయారు చేస్తారు. వీటితో ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలగకపోవచ్చు.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 03:04 PM