Curry Leaves: కూరల్లో వేసే కరివేపాకును ఇలా కూడా వాడొచ్చిన తెలిసి ఉండదు.. జుట్టు సమస్యలకు చెక్ పెట్టాలంటే..!

ABN , First Publish Date - 2023-07-21T15:48:48+05:30 IST

కరివేపాకును పెరుగులో కలిపి హెయిర్ మాస్క్‌లా వేసుకోవడం వల్ల తలలోని చుండ్రు తొలగిపోతుంది.

Curry Leaves: కూరల్లో వేసే కరివేపాకును ఇలా కూడా వాడొచ్చిన తెలిసి ఉండదు.. జుట్టు సమస్యలకు చెక్ పెట్టాలంటే..!
Hair Care Tip

చిన్న వయసులోనే జుట్టు మెరిసిపోవడం అనేది కామన్ అయిపోయింది. నెరిసిన తలతో బయటకు వెళ్ళాలన్నా, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ కి అటెండ్ కావాలన్నా కూడా ఇబ్బంది పడతారు. నలుగురిలో ముసలితనం వచ్చినట్లుగా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ ఫీలింగ్ నుంచి బయటపడాలంటే.. హోమ్ రెమిడీస్ మీదనే ఆధారపడాలి. వాటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) ఉండవు. ఈ హోం రెమెడీస్ జుట్టును స్ట్రాంగ్‌గా మార్చడానికి పని చేస్తాయి. అవి జుట్టు చిట్లడం, జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి.

హోమ్ రెమిడీస్ అనగానే ఎప్పట్లానే గోరింటాకు, ఉసిరి అనే కాకుండా అందరం రోజూ తినే ఆహారంలో ఎక్కవగా ఉపయోగించే ఆకు కరివేపాకు గురించి తెలుసుకుందాం. దీనితో జుట్టుకు మంచి బంధం ఉంది. జుట్టును ధృఢంగా మార్చడంలో కరివేపాకు ముందుంటుంది. ఇక ఇందులో జుట్టును నల్లగా మార్చే గుణాలుకూడా ఉన్నాయి.

ఈ ఆకులలో మంచి మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి స్కాల్ప్‌ను డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇది కాకుండా, కరివేపాకు విటమిన్ బి మంచి మూలం, ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రంగును నిర్వహిస్తుంది.

ఉసిరి, కరివేపాకు

కరివేపాకు హెయిర్ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేయవచ్చు. ఈ హెయిర్ మాస్క్ చేయడానికి, ఉసిరి, కరివేపాకు, మెంతులు తీసుకోవాలి. అరకప్పు కరివేపాకు, కొన్ని మెంతులను ముందురోజు రాత్రి నానబెట్టి, తాజా కరివేపాకును ఒక గిన్నెలో వేసి మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుపై అరగంట పాటు ఉంచిన తర్వాత కడగాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: వేప పుల్లలతో పళ్లు తోముకుంటే జరిగేది ఏంటి..? వీటిని వాడేవాళ్లకు ఈ నిజాలు తెలిసి ఉండదు కూడా..!


కరివేపాకు, కొబ్బరి నూనె

కరివేపాకును కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే ఈ నూనె జుట్టుకు టానిక్‌లా పనిచేస్తుంది. ఈ నూనెతో జుట్టు కూడా పెరుగుతుంది, స్కాల్ప్ శుభ్రం అవుతుంది. ఈ నూనెను తయారు చేయడానికి, ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని, కరివేపాకు వేసి ఉడికించాలి. కరివేపాకు నల్లగా మారినప్పుడు, నూనెను వేడి నుండి తీసివేసి, వడపోతతో, ఒక సీసాలో నింపుకోవాలి. దీనిని ప్రతి రెండు మూడు రోజులకోక సారి ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కరివేపాకు, పెరుగు

కరివేపాకును పెరుగులో కలిపి హెయిర్ మాస్క్‌లా వేసుకోవడం వల్ల తలలోని చుండ్రు తొలగిపోతుంది. హెయిర్ ప్యాక్ చేయడానికి, ఒక గుప్పెడు కరివేపాకును తీసుకొని వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌లో సుమారు 2 టీస్పూన్ల పెరుగు వేసి జుట్టుకు పట్టించాలి. ఈ హెయిర్ మాస్క్‌ను తలపై 30 నుండి 40 నిమిషాల పాటు ఉంచిన తర్వాత, షాంపూతో కడగాలి. జుట్టు మీద మెరుపు కనిపించడం ప్రారంభమవుతుంది. జుట్టు కూడా అందంగా మారుతుంది.

Updated Date - 2023-07-21T15:48:48+05:30 IST