White Hair: 30 ఏళ్లు కూడా రాకముందే తెల్ల జుట్టు వచ్చేసిందా..? మళ్లీ నల్లగా మారిపోవాలంటే ఈ ట్రిక్స్‌ను ఫాలో అవండి చాలు..!
ABN , First Publish Date - 2023-06-15T14:35:00+05:30 IST
ఈ హెయిర్ మాస్క్‌ని కొన్ని రోజుల వ్యవధిలో అప్లై చేయవచ్చు.
ఇప్పటి రోజుల్లో తెల్లజుట్టు అన్నివయసులో వారిలోనూ కనిపిస్తున్న సమస్యే. దీనికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంలేదు. కానీ మరీ వయసు రాకుండానే తెల్లజుట్టు అంటే కాస్త ఇబ్బందే.. దీని నుంచి బయటపడాలంటే మాటలు కాదు. ఒకసారి వెంట్రుకలు తెల్లబడటం మొదలైందంటే ఆ మెరుపు తల అంతటిలోనూ కనిపిస్తుంది. దీనితో మరింత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. జుట్టును నల్లగా మార్చేస్తాయంటూ మార్కెట్ లో చాలా రకాల ఉత్పత్తులు కనపించినా అవన్నీ మనకు చేటు చేసేవే కానీ, మంచి చేయవు. ఇక ఈ సమస్యకు మంచి పరిష్కారం అంటే అది మన ఇంటి వైద్యమే.
జుట్టు తెల్లబడటం అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య. చాలామందిలో అనేక కారణాల వల్ల జుట్టు ముందుగానే తెల్లగా మారుతుంది. వెంట్రుకల్లో పోషకాహారం లోపించడం, మితిమీరిన కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం, జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఎండలో కూడా జుట్టు తెరిచి ఉంచడం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇది కాకుండా, ఒత్తిడి కారణంగా చాలా సార్లు ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఇంట్లో కొన్ని వంట వస్తువులను ఉపయోగించడం ద్వారా తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చే ప్రయత్నం చేయవచ్చు.
మెంతి గింజలు జుట్టుకు పోషణ, తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చడానికి ఉపయోగపడతాయి. మెంతి గింజలు జుట్టును ఒకటి కాదు అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. జుట్టును పొడవుగా మార్చడంలో కూడా సహాయపడతాయి. మెంతి గింజలలో ఐరన్, ప్రొటీన్లు ఉంటాయి, దీని వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఈ గింజలలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంది, ఇది జుట్టు నెరసిపోకుండా చేస్తుంది. ఇవన్నీ తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతాయి.
మెంతి ముద్ద
జుట్టు నల్లగా మారాలంటే మెంతి పేస్ట్ రాసుకోవచ్చు. ఈ పేస్ట్ చేయడానికి, మెంతి గింజలను రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఈ గింజలను బాగా గ్రైండ్ చేయండి. 20 నుండి 25 నిమిషాల పాటు జుట్టుకు ఉంచిన తర్వాత తలను కడగాలి. ఈ పేస్ట్‌ని 15 రోజులకు ఒకసారి పెట్టుకోవచ్చు.
ఇది కూడా చదవండి: మిగిలిపోయిన చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం తప్పు కాదు కానీ.. ఎన్ని రోజుల్లోగా వాడేయాలో కూడా తెలుసుకోండి..!
మెంతి గింజలు నీరు
మెంతి గింజల నీటిని కూడా తెల్ల జుట్టు మీద అప్లై చేయవచ్చు. ఈ నీటిని తయారు చేయడానికి, మెంతి గింజలకు నీరు వేసి మంటపై ఉంచండి. ఈ నీటిని కాసేపు మరిగించిన తర్వాత చల్లార్చి ఫిల్టర్ చేయాలి. ఈ నీటిని రెండు రోజుల పాటు జుట్టుకు పట్టించవచ్చు. దీని వల్ల జుట్టు తెల్లబడటం తగ్గుతుంది.
మెంతులు, నిమ్మకాయ హెయిర్ మాస్క్
మెంతి గింజలను గ్రైండ్ చేసి, ఈ పొడిలో నీళ్లు, నిమ్మరసం మిక్స్ చేసి జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తల కడగాలి. ఈ హెయిర్ మాస్క్‌ని కొన్ని రోజుల వ్యవధిలో అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే జుట్టుకు మేలు కలుగుతుంది.
మెంతి నూనె
కొబ్బరి నూనెలో మెంతి గింజలు వేసి మరిగించాలి. దీనికి కొన్ని కరివేపాకులను కూడా చేర్చవచ్చు. ఈ నూనెను బాగా ఉడికించి ఒక సీసాలో ఉంచండి. ఈ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.