Tasty Drinking Water: తాగునీరు రుచిగా ఉండాలంటే ఇలా చేయండి చాలు...

ABN , First Publish Date - 2023-05-21T12:27:05+05:30 IST

దోసకాయ, తాజా పుదీనా కూడా రిఫ్రెష్ రుచులు. వాటిని ఒక సీసాలో నీటిలో వేయండి.

Tasty Drinking Water: తాగునీరు రుచిగా ఉండాలంటే ఇలా చేయండి చాలు...
Fruits & Vegetables

శరీరానికి నీరు తీసుకోవడం చాలా అవసరం. వేసవిలో మనందరికీ తెలుసు, హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం. ఇప్పుడు ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండాలంటే దానికి సిట్రస్ పండ్ల నుండి స్మాష్ చేసిన బెర్రీల వరకు, చక్కెర పానీయాలను తినకూడదనుకునే వారైతే, ఆరోగ్యంపై రాజీ పడకుండా జీవనశైలిని మొరుగుపరుచుకోవాలనుకుంటే మాత్రం ఇవి గొప్ప మార్గం.

నీటి రుచిని మరింత మెరుగ్గా చేయడం ఎలాగో చూద్దాం.

1. తాజా పండ్లు

శరీరాన్ని పోషించడానికి తాజా పండ్లు ఉత్తమ మార్గం. నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లు ఎల్లప్పుడూ నీటిని మెరుగుపరచడానికి గొప్ప మార్గం. దోసకాయ, తాజా పుదీనా కూడా రిఫ్రెష్ రుచులు. వాటిని ఒక సీసాలో నీటిలో వేయండి. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా నీటికి రుచిని కూడా ఇస్తుంది.

2. ఘనీభవించిన బెర్రీలు

ఐస్ క్యూబ్స్ గా ఉన్న బెర్రీలు నీటి రుచిని మెరుగుపరుస్తాయి. ఫ్రిజ్‌లోని ఐస్ ట్రేలో అంచు వరకు నీటితో నింపి చిన్న బెర్రీలను వేసి, ఆపై వాటిని గడ్డకట్టించండి.

ఇది కూడా చదవండి: బాబోయ్.. రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లు తింటే ఇంత నష్టమా?.. బాడీలో ఏం జరుగుతుందో తెలుసా...

3. నిమ్మకాయ ముక్కలు

నిమ్మకాయ ఎల్లప్పుడూ శక్తిని పెంచడానికి ఒక గొప్ప మార్గం. నీటిలో నిమ్మకాయను పిండి తాగినా సరిపోతుంది. లేదంటే పంచదార, ఉప్పుతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

4. జ్యూస్‌ని బేస్‌

నీటికి కొంచెం రుచిని జోడించాలనుకుంటే, జ్యూస్‌ని బేస్‌గా తీసుకోవడం మంచి మార్గం. ఒక గ్లాసు సాధారణ నీటిలో కొద్దిగా రసం లేదా చల్లని టీ వేసి బాగా కలపాలి. నీళ్లలో నచ్చిన రసాన్ని కలపండి. దాహం అనిపించగానే తీసుకోండి.

5. పండ్లు, కూరగాయల పీల్స్

సీజనల్ పండ్లు, దోసకాయ వంటి కూరగాయలను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. శరీరంలో వేడిని చేరనీయదు. దాహాన్ని కట్టేస్తుంది.

Updated Date - 2023-05-21T12:27:05+05:30 IST