White Hair: చాలా మందికి ఇష్టం ఉండని ఈ కూరగాయతో.. తెల్ల జుట్టుకు చెక్ పెట్టొచ్చట.. ఎలా వాడాలంటే..!

ABN , First Publish Date - 2023-07-18T14:44:52+05:30 IST

బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో వారం రోజుల పాటు ఆరనివ్వాలి.

White Hair: చాలా మందికి ఇష్టం ఉండని ఈ కూరగాయతో.. తెల్ల జుట్టుకు చెక్ పెట్టొచ్చట.. ఎలా వాడాలంటే..!
hair changes

గాలిలో నాణ్యత లేకపోవడం, కలుషితమైన నీరు, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడంతో చిన్నవయసులోనే తెల్లజుట్టు కనిపించడం మొదలవుతుంది. దీనిని వదిలించుకోవడానికి, చాలా రకాల ఖరీదైన రసాయన చికిత్సలు తీసుకుంటున్నారు కానీ ఎటువంటి ఫలితమూ కనిపించదు, అయితే, జుట్టు, చర్మానికి సంబంధించిన సమస్యను సరైన ఆహారం, దినచర్యతో నయం చేయవచ్చు.

మూమూలుగా పప్పులో సొరకాయ వేసినా, సొరకాయతో కూర చేసినా చాలామందికి నచ్చదు. చాలామంది సొరకాయను తినడానికి ఇష్టపడరు. అలాంటిది ఈ కూరగాయతో నెరిసిన జుట్టును నల్లగా మార్చ వచ్చట. ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా సొరకాయలోని పోషకాల కారణంగా దీనితో తయారు చేసిన నూనె, అలాగే సొరకాయ జ్యూస్ రెండూ జుట్టు పెరుగుదలలోనూ, తెల్లజుట్టును నల్లగా చేయడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదెలాగంటే..

సొరకాయ జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది.

తెల్ల వెంట్రుకలు, నల్లగా మారాలంటే వారానికి రెండు సార్లు సొరకాయతో తయారు చేసిన నూనె రాసుకోవాలి. ఇంట్లో కూడా ఈ నూనెను తయారు చేసుకోవచ్చు.

తయారు చేసే విధానం ఇదిగో..

సొరకాయ నూనె

దీన్ని చేయడానికి, ఒక సొరకాయ తీసుకోండి. బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో వారం రోజుల పాటు ఆరనివ్వాలి. ఒక బాణలిలో 250 గ్రాముల కొబ్బరి నూనెను వేడి చేసి, ఆపై పొడి సొరకాయ ముక్కలను వేసి బాగా మరిగించాలి. చల్లారాక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెతో జుట్టుకు రాత్రి నిద్రపోయే ముందు మంచి మసాజ్ చేయండి. ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయండి. ఈ రెసిపీని అనుసరిస్తే, 1 నెలలోపు జుట్టు పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: ఏ మందులూ అక్కర్లేదు.. ఇంట్లో దొరికే వీటితో.. ఈ 4 రకాల టిప్స్‌తో.. మీ జుట్టు భద్రం..!


సొరకాయలో పోషకాల విలువ

ఇందులోని పోషక విలువలు , మాంగనీస్ (3.39 గ్రా), సెలీనియం (0.62 గ్రా), విటమిన్ సి (10.1 మి.గ్రా), రిబోఫ్లావిన్ (0.022 మి.గ్రా), థియామిన్ (0.029 మి.గ్రా), పాంతోతేనిక్ యాసిడ్ (0.152 మి.గ్రా), విటమిన్ బి6 (0.04 mg), నియాసిన్ (0.32 mg), ఫోలేట్ (6 μ g), శక్తి (14k cal) ఉన్నాయి.

సొరకాయ రసం

సొరకాయ రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ రసం శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయినట్లయితే, సొరకాయ దానిని కరిగించడానికి సహకరిస్తుంది.

Updated Date - 2023-07-20T10:05:46+05:30 IST