Mango vs Banana: మామిడి పండ్ల రసమా..? అరటిపండ్ల జ్యూసా..? బరువు తగ్గాలనుకునేవాళ్లు దేనికి దూరంగా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2023-06-10T14:32:45+05:30 IST

ఒక గ్లాసు తియ్యని మామిడి షేక్‌లో 170 కేలరీలు ఉంటాయి, అయితే ఒక గ్లాసు తియ్యని అరటి షేక్‌లో 150 కేలరీలు ఉంటాయి.

Mango vs Banana: మామిడి పండ్ల రసమా..? అరటిపండ్ల జ్యూసా..? బరువు తగ్గాలనుకునేవాళ్లు దేనికి దూరంగా ఉండాలంటే..!
antioxidants and phytonutrients.

వేసవిలో రకరకాల పండ్లు మనకి దొరుకుతాయి అయితే పుచ్చకాయ నుండి మామిడి వరకు, అవి వేసవి కాలంలో రావడం మొదలవుతాయి. అరటి, మామిడి రెండూ తీపి పండ్లు బరువు తగ్గాలని ప్రయత్నాలు చేస్తువారు తరచుగా ఈ రెండు షేక్‌లలో ఏది తాగడానికి సరైనది అనే గందరగోళానికి గురవుతారు. కూల్ డ్రింక్ మండే వేడిలో శరీరానికి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సీజన్‌లో శీతల పానీయాలు, ఐస్ క్రీం, జ్యూస్‌లు, షేక్‌లు చాలా ఇష్టంగా తాగేస్తూ ఉంటారు. అయితే అరటి, మామిడి షేక్ గురించి బరువు తగ్గడానికి రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం.

అరటిపండుతో బరువు తగ్గుతారా?

అరటిపండు తినడం, జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారా? ఇందులో ఉంటే ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అరటిపండు ఊబకాయాన్ని పెంచుతుందని చాలా మంది నమ్ముతారు, కానీ సరైన పద్ధతిలో ఆహారంలో తీసుకోవచ్చు. అరటిపండు కడుపులో మంటను తగ్గిస్తుంది. వ్యాయామం తర్వాత ఈ పండును తినవచ్చు. అరటిపండులో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలకు మంచిది. జీర్ణక్రియ సమస్య ఉంటే జీవక్రియకు మెరుగ్గా పని చేస్తుంది. వ్యాయామం తరవాత దీనిని తీసుకుంటే బరువు కోల్పోతారు. ఈ పండు ఎక్కువ సేపు ఆకలి కాకుండా నిండుగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: పొరపాటున కూడా ఖాళీ కడుపుతో ఈ 4 రకాల పండ్లను అస్సలు తినొద్దు.. లాభం సంగతి పక్కన పెడితే..!

మామిడి పండుతో బరువు తగ్గవచ్చా..

వేసవి కాలంలో మామిడి పండ్లు సమృద్ధిగా లభిస్తాయి. మామిడి పండ్లను ఇష్టమైనవారు వీటిని విపరీతంగా తింటారు. మామిడిలో విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్త కణాలు, ఆరోగ్యకరమైన కొల్లాజెన్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి వ్యాధులను నివారిస్తాయి. మామిడిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, అయినప్పటికీ, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంతృప్తిని పెంచుతుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా నిరోధిస్తుంది. అధ్యయనం ప్రకారం, మామిడి పండ్ల పెద్దప్రేగు క్యాన్సర్ గుండె, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది.

మామిడి లేదా అరటి షేక్

అరటి, మామిడి పోషకాలను పరిశీలిస్తే, బనానా షేక్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఒక గ్లాసు తియ్యని మామిడి షేక్‌లో 170 కేలరీలు ఉంటాయి, అయితే ఒక గ్లాసు తియ్యని అరటి షేక్‌లో 150 కేలరీలు ఉంటాయి.

త్రాగడానికి సరైన సమయం ఏది?

బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామం తర్వాత అరటిపండు షేక్ తాగవచ్చు. ఇది వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అరటిపండు షేక్ తయారీలో టోన్డ్ మిల్క్‌ని ఉపయోగించడం, ఇంట్లో తయారు చేసి త్రాగడం ఉత్తమం. ఇందులో చక్కెరను కలపకుండా ఉండటం మంచిది. తీపి రుచి కోసం బెల్లం, తేనె కలపండి.

Updated Date - 2023-06-10T14:32:45+05:30 IST