National Almond Day: గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బాదాములు

ABN , First Publish Date - 2023-01-22T18:43:36+05:30 IST

బాదాముల (Almonds)ను ఇష్టపడని వారు ఉండరు. చిన్నా, పెద్దా అందరూ వీటికి ఫ్యాన్సే. ఇప్పుడివి రోజువారీ డైట్‌లో తప్పనిసరి పదార్థాల్లో ఒకటిగా మారాయి. ఇందులో బోల్డన్ని

National Almond Day: గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బాదాములు

న్యూఢిల్లీ: బాదాముల (Almonds)ను ఇష్టపడని వారు ఉండరు. చిన్నా, పెద్దా అందరూ వీటికి ఫ్యాన్సే. ఇప్పుడివి రోజువారీ డైట్‌లో తప్పనిసరి పదార్థాల్లో ఒకటిగా మారాయి. ఇందులో బోల్డన్ని పోషకాలు ఉండడం వల్ల ఇవి ఇప్పుడు వంటిట్లోకీ వచ్చి చేరాయి. ఉదయం పూట బాదాములను తినడం దేశంలో చాలా కాలంగా వస్తున్నదే. ఇవి చర్మ సంరక్షణకు ఇవి చక్కగా ఉపయోగపడతాయి. వీటతో బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దేశంలో ప్రతి ఏడాది జనవరి 23న జాతీయ బాదాముల దినోత్సవం(National Almond Day)గా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.

బాదాములలో 15 అత్యవసర పోషకాలు ఉన్నాయి. విటమిన్-ఇతోపాటు డైటరీ ఫైబర్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అలాగే, దాదాపు 30 గ్రాముల బాదాముల్లో 13 గ్రాముల అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, 9 గ్రాముల మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. రోజూ 23 బాదాములను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.

ప్రయోజనాలు

బాదాములలో ఆకలి తీర్చే గుణాలు ఉన్నాయి. భోజనానికి భోజనానికి మధ్య వీటిని తీసుకుంటే ఆకలి తీరుస్తాయి. వీటిలో అతి తక్కువ గ్లెసిమిక్ ఇండెక్స్ ఉందని పలు అధ్యయనాలు చెప్పాయి. ఇవి బ్లడ్ షుగర్ ప్రభావంతోపాటు కార్బోహైడ్రేట్ ఫుడ్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. ఫలితంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

చర్మ ఆరోగ్యం

బాదాములలో విటమిన్-ఇ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే, వీటిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు బాదాములను తీసుకోవడం వల్ల ముఖంపై మడతలను తగ్గించొచ్చు. చర్మ సౌందర్యం పెరుగుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అల్ట్రావైలెట్ బి రేడియేషన్ (UVB) కాంతిని ఎదుర్కొనే సామర్థ్యం చర్మానికి కలుగుతుంది.

పేగు ఆరోగ్యం

బాదాములలో ఉన్న డైటరీ ఫైబర్ కారణంగా ఆరోగ్యవంతులైన పెద్దలలో బ్యూటీకేర్ కాన్సన్‌ట్రేషన్ పెరుగుతుంది. బాదాములను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగులలో మైక్రోబయోమ్ డైవర్సిటీ పెరుగుతుంది. ప్రమాదకర బ్యాక్టీరియా స్థాయిని తగ్గిస్తుంది. వర్కవుట్ తర్వాత బాదాములను తినడం వల్ల వ్యాయామం వల్ల కలిగే అలసట తగ్గుతుంది. కండరాలు దెబ్బతినకుండా బాదాములు రక్షిస్తాయి.

డిస్లీపిడెమియా

డైట్‌లో బాదాములను భాగంగా చేసుకోవడం ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చు. సీవీడీకి అతిముఖ్యమైన కారణాలలో ఒకటైన డిస్లీపిడెమియాను తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న బాదాముల పట్ల అవగాహన కల్పించేందుకు ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహిస్తున్న వారం రోజుల కార్యక్రమాల్లో ఆరోగ్య నిపుణులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. జనవరి 23న జాతీయ బాదాముల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి రోజూ 23 గ్రాముల బాదాములు తినమని ఆరోగ్య నిపుణులు ప్రోత్సహిస్తున్నారు. ప్రముఖ టీవీ నటుడు రణ్‌విజయ్ సింగ్ ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.

ఒత్తిడి నుంచి బయటపడేందుకు, రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు బాదాములు తోడ్పడతాయని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ షీలా కృష్ణస్వామి అన్నారు. మెరుగైన ఆరోగ్యాన్ని కోరుకునే వారు తప్పనిసరిగా వీటిని తమ డైట్‌లో జోడించుకోవాలని సూచించారు. బాదాములలో అత్యధిక పరిమాణంలో విటమిన్-ఇ, పాలీఫినాల్స్ ఉన్నాయని, యూవీ బీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయని మెడికల్ డైరెక్టర్, కాస్మెటాలజిస్ట్ డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా పేర్కొన్నారు. బాదాముల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి మజిల్ మాస్‌ను మెరుగుపరుచుకునేందుకు తోడ్పడతాయని ఫిట్‌నెస్ నిపుణురాలు, సెలబ్రిటీ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా పేర్కొన్నారు. శరీర కణజాలానికి అవసరమైన తేవను బాదాములు అందిస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణురాలు నితికా కోహ్లీ అన్నారు. బాదాములు అందించే ప్రయోజనాల కారణంగా తను వాటిని డైట్‌లో భాగం చేసుకున్నట్టు ప్రముఖ టీవీ నటి నిషా గణేశ్ అన్నారు.

Updated Date - 2023-01-22T18:43:37+05:30 IST