Dry Fruits: డ్రైఫ్రూట్స్‌తో లాభాలే కాదండోయ్.. ఈ సైడ్ ఎఫెక్టులు కూడా.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. అస్సలు ఆలస్యం చేయకుండా..!
ABN , First Publish Date - 2023-07-03T16:26:19+05:30 IST
నట్స్‌లో కొవ్వు పదార్ధాల కారణంగా కేలరీలు ఎక్కువగా ఉంటాయి.
నట్స్ ఆరోగ్యకరమైన ఆహారం. కాస్త నీరసంగా ఉన్నా, జబ్బుపడినవారు త్వరగా కోలుకోవాలన్నా కూడా నట్స్ సహకరిస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో పెరుగుదల బావుంటుంది. అయితే వీటిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కొందరిలో సమస్యలు రావచ్చు. ఈ గింజలతో కలిగే 5 దుష్ప్రభావాలు ఇవే.
అలర్జీలు
డ్రై ఫ్రూట్స్ సాధారణ ఆహార అలెర్జీ కారణాలలో ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పెదవులు లేదా గొంతు వాపు, అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన సమస్యలు దారితీయవచ్చు. డ్రై ఫ్రూట్స్‌తో అలర్జీ ఉన్నవారు వీటిని తినకూడదు.
జీర్ణ సమస్యలు
కొందరికి నట్స్ తిన్న తర్వాత జీర్ణ సమస్యలు రావచ్చు. వీటిలో ఉబ్బరం, గ్యాస్, పొత్తికడుపు తిమ్మిరి, అతిసారం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఈ సమస్యలు తరచుగా గింజలలోని సహజ ఫైబర్, కొవ్వు కారమంగా అవి జీర్ణం కావడంలో ఇబ్బందిని కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి: ఓ వైపు బిర్యానీ తింటూ మరో వైపు ఉల్లిపాయల్ని నంజుకునే అలవాటుందా..? ఈ నిజాలు తెలిస్తే ఇక ముట్టుకోరేమో..!
బరువు పెరుగుట
నట్స్‌లో కొవ్వు పదార్ధాల కారణంగా కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి కారణం అవుతుంది. అయితే, వీటిని సమతుల్య పరిమాణంలో తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు.
ఆక్సలేట్ కంటెంట్
బాదం, జీడిపప్పు, వేరుశెనగ వంటి కొన్ని రకాల గింజలు ఆక్సలేట్‌లను కలిగి ఉంటాయి. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ ఉండవు. డ్రై ఫ్రూట్స్‌కు అలెర్జీ ఉంటే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.