Onions: పచ్చి ఉల్లిపాయలను తింటే ఏమవుతుందిలే అనుకుంటున్నారా..? ఈ నిజాలు తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-07-17T13:44:18+05:30 IST

పచ్చి ఉల్లిపాయను ఆహారంగా తీసుకనోవడం వల్ల గుండెల్లో మంటగా ఉంటుంది.

Onions: పచ్చి ఉల్లిపాయలను తింటే ఏమవుతుందిలే అనుకుంటున్నారా..? ఈ నిజాలు తెలిస్తే..!
onion

ఉల్లిపాయలను బిర్యానీలో నిమ్మాకాయ పిండుకుని తినడం మామూలుగా అందరూ చేస్తున్న పనే. ఉల్లిపాయ నంజుకోనిదే పెరుగన్నం తినని వారుకూడా చాలామందే ఉన్నారు. అయితే పచ్చి ఉల్లిపాయను నేరుగా తినేయడం ఒకప్పుడు ఏమో కానీ ఇప్పటి రోజుల్లో ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇది అనేక సమస్యలను తెచ్చిపెడుతుందట. ఒకప్పుడు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనే నానుడికి ఫుల్ స్టాప్ పెడుతూ ప్రస్తుతం ఉల్లి విషయంలోను పచ్చిగా తీసుకోకూడదనే ఆరోగ్యానికి హానికరం అట. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం.

చక్కెర స్థాయి తగ్గుతుంది.

పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని తినడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయట. అందుకే షుగర్ సమస్య ఉన్నవారు పచ్చి ఉల్లిపాయను తినకపోవడమే మంచిది. తినాల్సి వస్తే డాక్టర్ సలహా తీసుకోవాలి.

ప్రేగుల మీద ప్రభావం

పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలో ప్రేగులపై ప్రభావం కనిపిస్తుంది. దీని కారణంగా క్రమంగా జీర్ణ సమస్యలు రావచ్చు.

గర్భిణీ స్త్రీలు

గర్భిణీ స్త్రీలు పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకుంటే గుండె మంట, వాంతులు, వికారం వంటి సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఈ చేపల కూరను తినాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సిందే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంటకాలివీ..!

మలబద్దకం సమస్య

ఉల్లిపాయల్లోని ఫైబర్ కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పచ్చి ఉల్లిపాయను ఎక్కువగా తీసుకుంటే కడుపునొప్పి, మలబద్ధకం వస్తుంది.


వాలిటోసిస్

పచ్చి ఉల్లిపాయ ముక్కలను ఎక్కువగా తింటే నోటి దుర్వాసనతో పాటు దుర్వాసన కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

గుండెల్లో మంట

పచ్చి ఉల్లిపాయను ఆహారంగా తీసుకనోవడం వల్ల గుండెల్లో మంటగా ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే పొటాషియం కారణంగా ఇది శరీరంలోకి వెళ్లి కార్టియోలివర్ వ్యవస్థను దెబ్బతీస్తుంది.

ఉల్లిపాయ లక్షణాలు..

ఉల్లిపాయలో చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. ఇవి శరీరానికి కావలసిన మేలు చేస్తాయి. కాకపోతే పచ్చిగా తినడం., ఉల్లిని అతిగా తినడమే సమస్యను తెచ్చి పెడుతుంది.

Updated Date - 2023-07-17T13:44:18+05:30 IST