Children And Medication : ప్రతి ముగ్గురు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలకు జ్వరం తగ్గినా సరే మందులు వేస్తున్నారట..

ABN , First Publish Date - 2023-02-24T13:07:33+05:30 IST

ప్రతి చిన్నదానికి మందులు వాడటంతోనే చికిత్స అందినట్టుగా భావించడం మానాలనేది వైద్యుల సూచన.

Children And Medication : ప్రతి ముగ్గురు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలకు జ్వరం తగ్గినా సరే మందులు వేస్తున్నారట..
medication

పిల్లలకు జ్వరాన్ని తగ్గించే మందులను అవసరం లేనప్పుడు కూడా ఇస్తున్నారనేది వైద్య నిపుణులు అంటున్న మాట. ఇలా చేయడం వల్ల పిల్లల్లో అధిక ఉష్ణోగ్రతలు పెరిగి అనేక అంటువ్యాధులతో పోరాడటానికి కారణం అవుతుందనేది నిపుణులు గమనించారు. ప్రతి చిన్నదానికి మందులు వాడటంతోనే చికిత్స అందినట్టుగా భావించడం మానాలనేది వారి సూచన. అసలు జ్వరం వస్తే తక్షణమే మందులు మింగించకుండా తల్లిదండ్రులు వారి నుదిటిపై తడిగా ఉన్న వాష్‌క్లాత్‌ను ఉంచడం వల్ల, పిల్లలకు తేలికైన, వదులుగా ఉండే దుస్తులు వేయడం ద్వారా పిల్లల అసౌకర్యాన్ని తగ్గించవచ్చని అంటున్నారు.

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు జ్వరాలకు మందులు అవసరం లేని సందర్భాల్లో కూడా ఇవ్వడం వల్ల వారిలో ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే శరీర సామర్థ్యాన్ని తగ్గించిన వారు అవుతారట.

పిల్లాడికి జ్వరం వచ్చిందని తెలియగానే సరిగా పరీక్షించకుండానే మందులు మింగిచడం అనేది సమస్యను పెంచడమేనని వైద్యులు అంటున్నారు. చిన్న చిన్న చిట్కాల ద్వారా తగ్గించవచ్చు. మరీ పరిస్థితి పెరుగుతుందని అనిపిస్తే వైద్యుని సలహా మీద మాత్రమే మందులు మితంగా వాడాలని చెబుతున్నారు.

జ్వరం 100.4 , 101.9 డిగ్రీల మధ్య ఉంటే సగం మంది తల్లిదండ్రులు జ్వరం మందులు ఇస్తారు. 4 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు జ్వరంతో ఇబ్బంది పడుతుంటే వైద్యుడిని సంప్రదించాలని అధ్యయనాలు చెపుతున్నాయి. మిగతా వయసు పిల్లలకు మందులను వాడేయడం కాకుండా తగిన చర్యల తీసుకోవడం ద్వారా తీవ్రతను తగ్గించవచ్చు.

పెరిగిన అల్లరి

తగ్గిన మూత్రవిసర్జన (సగటు కంటే తక్కువ మూత్రవిసర్జన)

నొప్పి సంకేతాలు

జ్వరం తగ్గుతున్నప్పుడు కూడా ప్రవర్తనలో మార్పులు వస్తాయి.

23.jpg

104 డిగ్రీలకు చేరుకునే ఏవైనా జ్వరాలు లేదా ఎక్కువ కాలం పాటు ఉన్న జ్వరాలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించాలి. 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు 24 గంటల కంటే ఎక్కువ కాలం లేదా 2 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మూడు రోజుల కంటే ఎక్కువ కాలం ఉండే జ్వరం తీవ్రతను బట్టి మెడిసిన్ ఇవ్వాలి.

Updated Date - 2023-02-24T13:07:35+05:30 IST