Summer: ఎండాకాలంలో చెమటలు పట్టని వ్యక్తులే ఉండరు!.. కానీ ఈ డ్రింక్స్ తాగినోళ్లకి డీహైడ్రేషన్ సమస్య ఉండదు!
ABN , First Publish Date - 2023-04-14T13:30:52+05:30 IST
నిమ్మరసం పిండడం వల్ల రుచికరమైన హైడ్రేటింగ్ వేసవి పానీయం తయారవుతుంది.
వేసవి వచ్చేసింది, దానితో వేడిని తట్టుకోవడానికి హైడ్రేటెడ్‌గా ఉండాల్సిన అవసరం వస్తుంది. వేసవి వేడిలో బయటకు వెళ్ళి పనిచేయాల్సి వస్తే, చమట ద్వారా శరీరం కోల్పోయే ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడం చాలా ముఖ్యం. దీనిని పానీయాలు తాగడంతో మాత్రమే సాధ్యం అవుతుంది. శరీరం పనితీరుకు ఎలక్ట్రోలైట్స్ కీలకం. దీనితో ద్రవ సమతుల్యత, కండరాల పనితీరు, నరాల పనితీరును నియంత్రించడంలో కీలకపాత్ర పోషించేది ఖనిజాలు. శరీరానికి చమట పట్టినపుడు ఎలక్ట్రోలైట్ లను కోల్పోతాము. అలాగే శరీరం డిహైడ్రేషన్ కలిగి అసమతుల్యతకు లోనవుతుంది.
ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ వీటిని సాధారణ పదార్థాలతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రోలైట్ పానీయాలు వేసవి అంతా మిమ్మల్ని హైడ్రేట్‌గా, ఎనర్జీగా ఉంచుతాయి:
సిట్రస్ ఎలక్ట్రోలైట్ డ్రింక్:
1. తాజాగా పిండిన నిమ్మరసం
2. నీరు
3. తీపి కోసం తేనె
4. సముద్రపు ఉప్పు చిటికెడు
5. ఈ పదార్థాలను కలపండి. రిఫ్రిజిరేటర్లో కాసేపు చల్లబరచండి. ఈ రిఫ్రెష్ పానీయం విటమిన్ సి, ఎలక్ట్రోలైట్స్‌తో నిండి ఉంటుంది, ఇది వేసవిృలో హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహకరిస్తుంది.
కొబ్బరి నీళ్ల ఎలక్ట్రోలైట్ డ్రింక్:
1. తాజా కొబ్బరి నీరు
2. సముద్రపు ఉప్పు చిటికెడు
3. రుచి కోసం తాజా పుదీనా ఆకులు
4. కొబ్బరి నీరులో ఎలక్ట్రోలైట్స్ తోపాటు పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి, ఇది రీహైడ్రేషన్‌కు అనువైన పానీయం. ఇందులో అదనపు ఎలక్ట్రోలైట్ బూస్ట్ కోసం ఒక చిటికెడు సముద్రపు ఉప్పు, రుచి కోసం కొన్ని తాజా పుదీనా ఆకులను కలిపితే మరింత రుచిగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: అంబేడ్కర్ జయంతి నాడు లండన్‌లో భారత్‌కు విజయం..
పుచ్చకాయ ఎలక్ట్రోలైట్ డ్రింక్:
1. తాజా పుచ్చకాయ రసం
2. నీరు
3. సముద్రపు ఉప్పు చిటికెడు
పుచ్చకాయ అనేది పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్‌లను కలిగి ఉండే హైడ్రేటింగ్ పండు. తాజా పుచ్చకాయ జ్యూస్ లో ఒక చిటికెడు సముద్రపు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం పిండడం వల్ల రుచికరమైన హైడ్రేటింగ్ వేసవి పానీయం తయారవుతుంది.
వేసవి నెలల్లో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. శరీరం కోల్పోయిన ద్రవాలు, అవసరమైన ఖనిజాలను తిరిగి నింపడానికి ఎలక్ట్రోలైట్ పానీయాలు చాలా అవసరం. కాబట్టి, ఈ టాప్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌తో హైడ్రేటెడ్‌గా ఉండండి. అంతేకాదు వేసవిలో కలిగే ఉక్క, వడదెబ్బ తగలడం వంటి చాలా రకాల సమస్యలను ఇవి దగ్గరకు కూడా రానీయవు.