Summer Season Mango: మామిడికాయలు తింటే మొటిమలు రావడం పక్కానా.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది..!
ABN , First Publish Date - 2023-05-23T12:31:29+05:30 IST
మామిడిలో అధిక చక్కెర కూడా మొటిమలకు దారితీస్తుంది
వేసవి కాలం వచ్చింది, దానితో మామిడి పండ్ల సీజన్ కూడా వచ్చినట్టే..ఈ జ్యుసి ఫ్రూట్‌లో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. మామిడి అత్యంత ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటిగా రుచిలో రారాజుగా చెప్పుకొస్తున్నా దీనిని తీసుకున్నాకా చాలామందిలో శరీరం వేడి చేసి చిన్న చిన్న గడ్డలు, మొటిమలు వస్తాయనే వాదనలూ లేకపోలేదు. దీనిగురించి తెలుసుకుందాం.
కృత్రిమ కార్బైడ్‌లు లేకుండా సహజంగా పండిన సేంద్రీయ మామిడి పండ్లను తీసుకుంటున్నామని నిర్ధారించుకోవాలి, ఇక మామిడిలో అధిక ఎక్కువ చక్కెర కూడా మొటిమలకు దారితీస్తుంది. మామిడిపండ్లను మితంగా తీసుకోవాలి. దీనికి తోడు, మొటిమలు మామిడి పండ్ల వల్ల వచ్చాయని అనుమానం ఉంటే :
ఇది కూడా చదవండి: ఎండలకు తట్టుకోలేక ఫ్రిజ్ నీళ్లు తాగే వాళ్లకు ఈ విషయం తెలుసో.. లేదో..!
మామిడి పండ్లను తిన్న తర్వాత విరేచనాల ప్రమాదం ఉంటుంది. వేడిచేసిన పండు మొటిమలకు కారణమవుతుంది. మామిడి పండ్లను తిన్న తర్వాత కాస్త శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పానీయాలను తీసుకోవాలి. మామిడికాయలను తినే ముందు నీటిలో నానబెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఇది కృత్రిమంగా పండిన మామిడిని గుర్తించడంలో సహాయపడుతుంది, పండ్లను మగ్గబెట్టడానికి వాడే కెమికల్స్ తొలగిపోవడమే కాకుండా, అలెర్జీ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.