Drinking tea: పరగడుపునే టీ తాగుతున్నారా?. అయితే వెంటనే మానేయండి.. ఈ ఒక్క కారణం తెలిస్తే చాలు...

ABN , First Publish Date - 2023-04-28T14:02:58+05:30 IST

టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు. అంతేకాదు ఈ అలవాటు యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.

Drinking tea: పరగడుపునే టీ తాగుతున్నారా?. అయితే వెంటనే మానేయండి.. ఈ ఒక్క కారణం తెలిస్తే చాలు...
Tea lovers

ఉదయం కాగానే టీ తాగి రిలాక్స్ అయ్యేవారు కోకొల్లలు. మనలో చాలా మందికి టీ ఉదయాన్నే తాగితేగానీ రోజు మొదలయిన ఫీలింగ్ ఉండదు. ఇది మంచి అలవాటేనా, లేదా అనిదానికంటే రిలాక్స్ అవుతున్నామా లేదా అనే ఆలోచిస్తాం. మరికొందరిలో టీ అనేది ఓ వ్యసనంగా మారిన వారూ ఉంటారు. ఇంత ఇదిగా టీ తాగడం అనేది మనకు మంచిదేనా?

ఆలోచనలతో ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడు స్నేహితులతో కలిసి తాగడం ఇలా చాలామందికి అలవాటుగా మారిపోయింది టీ. బ్లాక్ టీలోని క్యాటెచిన్‌లు, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలంటాయి. ఇది రోగనిరోధక శక్తిని, జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయం పూట మొదటగా బెడ్ టీ తాగడం చాలా మంది భారతీయ కుటుంబాలలో ఒక సాధారణ పద్ధతి. టీ ఒక రుచికరమైన, ఓదార్పునిచ్చే పానీయం అయితే, అందులో కెఫిన్ ఉంటుంది, ఇది శరీరంపై ప్రభావం చూపే ఒక ఉద్దీపనగా పనిచేస్తుంది.

కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ లేదా మరేదైనా కెఫిన్ ఉన్న పానీయం తాగడం వల్ల ఎసిడిటీ పెరగడంతోపాటు జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఎందుకంటే కెఫిన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది చికాకు కారణమవుతుంది. టీ మూత్ర విసర్జనను పెంచుతుంది. నిర్జలీకరణానికి కారణమవుతుంది, ముఖ్యంగా ఉదయం శరీరం ఇప్పటికే చాలా గంటలు నీరు లేకుండా నిర్జలీకరణానికి గురైనప్పుడు. మళ్ళీ పరగడుపునే టీ తాగడం అంటే ఇది టానిన్‌లను కలిగి ఉంటుంది, ఇవి ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలతో బంధించగలవు.

ఇది కూడా చదవండి: బాబోయ్.. మలేరియాకు కారణమయ్యే ఒక్క దోమ కుడితే ఇంత హానికరమా?.. శరీరంలో జరిగే 3 మార్పులు ఇవే

టీలో సహజ ఆమ్లాలు ఉంటాయి, ఇవి దంతాల ఎనామెల్‌ను నాశనం చేస్తాయి, ప్రత్యేకించి ఎక్కువ మొత్తంలో టీని తీసుకున్నప్పుడు. టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు. అంతేకాదు ఈ అలవాటు యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరానికి ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి ఖాళీ కడుపుతో టీ తాగడం మానేయాలి. నివేదిక ప్రకారం, ఖాళీ కడుపుతో గర్భిణీ స్త్రీలు టీ తాగినా కూడా పుట్టబోయే బిడ్డకు హానికరం. కలబంద రసం, సాధారణ కొబ్బరి నీరు, ముడి తేనె, నీటిలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ , కొబ్బరి వెనిగర్ వంటివి టీకి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు. అలవాటు చేసుకోండి.

Updated Date - 2023-04-28T14:03:40+05:30 IST