Health Benefits of Apples: జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవాళ్ళు యాపిల్ తింటే అంతా సెట్ అయిపోద్దట.. రోజూకో యాపిల్ తినేయండి మరి..!

ABN , First Publish Date - 2023-03-28T09:49:49+05:30 IST

స్నాక్స్ రూపంలో వీటిని తింటే ఇంకా మంచి ఫ‌లితం ఉంటుంది.

Health Benefits of Apples: జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవాళ్ళు యాపిల్ తింటే అంతా సెట్ అయిపోద్దట.. రోజూకో యాపిల్ తినేయండి మరి..!
health benefits of apples.

రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ దగ్గరకు వెళ్లాల్సిన అవ‌స‌రమే రాదట.. అయితే అది నిజంగా నిజ‌మే. ఎందుకంటే.. యాపిల్ పండ్లు మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఇందులో ఉండే ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫోలేట్‌, బీటా కెరోటీన్‌, విట‌మిన్ కె త‌దిత‌ర పోష‌కాలు మ‌న శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తాయి. ఇవి మ‌న ఆక‌లి తీర్చ‌డ‌మే కాదు.. మ‌రోవైపు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను కూడా అందిస్తాయి. అధిక బ‌రువు త‌గ్గేందుకు, గుండె ఆరోగ్యానికి యాపిల్ మేలు చేస్తాయి.

ఇక యాపిల్ పండ్ల వ‌ల్ల జీర్ణ‌స‌మ‌స్య‌లు తగ్గుతాయట..

ఈమధ్య కాలంలో మన జీవిన శైలిలో వస్తున్న మార్పులు, అస్త‌వ్య‌వ‌స్త‌మైన సరైన పోషకారం తీసుకోకపోవడం, ఆహారాన్ని సమయానికి తీసుకోకపోవడం వంటి త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల అనేక మందికి జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఈ స‌మ‌స్య‌లు ఇత‌ర అనారోగ్యాల‌కు కూడా కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో మొత్తం మీద ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది.

అయితే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటే..

దాదాపుగా ఇత‌ర అనారోగ్యాలు కూడా రాకుండా చూసుకోవ‌చ్చు. అందుకు గాను యాపిల్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి. నిత్యం యాపిల్ పండ్ల‌ను తింటే వాటిలో ఉండే ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం ఏర్ప‌డ‌కుండా చూస్తుంది.

ఇది కూడా చదవండి: మీ కళ్లు తరచుగా మండే అగ్నిగోళాల్లా మారుతుంటాయా..? కారణం ఈ ఐదే..!

శ‌రీరంలోని జీర్ణాశ‌యంలో ఉండే మంచి బాక్టీరియాకు యాపిల్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి. దీని వ‌ల్ల మ‌నం తినే ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. దీంతో జీర్ణాశ‌యం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక యాపిల్ పండ్ల‌ను రోజులో ఎప్పుడైనా తీసుకోవ‌చ్చు. స్నాక్స్ రూపంలో వీటిని తింటే ఇంకా మంచి ఫ‌లితం ఉంటుంది. వేస‌విలో ఇత‌ర కూర‌గాయ‌లు, పండ్ల‌తో క‌లిపి యాపిల్‌ను స‌లాడ్ రూపంలో తీసుకోవ‌చ్చు.

యాపిల్ పండ్ల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయ‌ని సైంటిస్టు‌లు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. దీంతోపాటు డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. యాపిల్‌ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎముక‌లను దృఢంగా మారుస్తాయి. వీటిలోని ఫైబ‌ర్ అధిక బ‌రువును తగ్గించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

Updated Date - 2023-03-28T09:49:49+05:30 IST