Banana: అరటికాయలు పాడయిపోయాయి కదా అని పారేస్తున్నారా..? అదే మీరు చేస్తున్న మిస్టేక్.. ఇలా కూడా వాడొచ్చని తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-06-16T12:08:29+05:30 IST

బ్రెడ్ మిశ్రమాన్ని తయారు చేయడానికి, ఒక పెద్ద గిన్నెలో, గుజ్జు అరటిపండ్లు కరిగించిన వెన్న కలపండి.

Banana: అరటికాయలు పాడయిపోయాయి కదా అని పారేస్తున్నారా..? అదే మీరు చేస్తున్న మిస్టేక్.. ఇలా కూడా వాడొచ్చని తెలిస్తే..!
banana bread

అరటి పండు సంవత్సరంలో 12 నెలల పాటు అందుబాటులో ఉండే ఒక పండు. ఈ అరటి పండు మామూలుగా మన ఇళ్ళల్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే తినడానికి కొని తెచ్చుకుని ఈ పండ్లు రెండు మూడు రోజులకే నల్లగా మారిపోతూ ఉంటాయి. నల్లగా మారిన పండ్లు తినడానికి బాగోవని తీసి పారేస్తూ ఉంటాం. అయితే వీటితో చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన బనానా బ్రెడ్ రెసిపీని తయారు చేయచ్చట. నిజమే ఈ నల్లని పండ్లతో బనానా కేక్ చేయడం చాలా సులభం. దీన్ని చేయడానికి ఏం కావాలంటే..

మెటీరియల్

2 నుంచి 3 పండిన అరటిపండ్ల గుజ్జు, 1/2 కప్పు ఉప్పు లేని వెన్న, కరిగించి తీసుకోండి. 1 కప్పు గ్రాన్యులేటెడ్ చక్కెర, 2 పెద్ద గుడ్లు, 1 టీస్పూన్ వెనిల్లా ఎసెన్స్, 1 3/4 కప్పులు మైదా పిండి, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 కప్పు తరిగిన బాదం., 1/2 కప్పు చాక్లెట్ చిప్స్ తీసుకోండి.

ఇది కూడా చదవండి: మిగిలిపోయిన కూల్‌డ్రింక్స్‌.. పాడయిపోయిందని మర్నాడు పారబోస్తున్నారా..? దాంతో ఇన్ని లాభాలున్నాయని తెలిస్తే..!

తయారు చేసే పద్ధతి

మార్కెట్ స్టైల్ బనానా బ్రెడ్ చేయడానికి, ముందుగా ఓవెన్‌ను 350°F (175°C)కి ప్రీహీట్ చేయండి. తర్వాత 9x5 అంగుళాల బ్రెడ్‌లోఫ్ పాన్‌కు వెన్న రాసి పక్కన పెట్టండి. బ్రెడ్ మిశ్రమాన్ని తయారు చేయడానికి, ఒక పెద్ద గిన్నెలో, గుజ్జు అరటిపండ్లు కరిగించిన వెన్న కలపండి. హ్యాండ్ బ్లెండర్ లేదా ఎలక్ట్రిక్ బ్లెండర్‌తో బాగా కలపండి. అరటిపండు మిశ్రమంలో చక్కెర, గుడ్లు, వెనీలా ఎసెన్స్ కలపండి. ప్రత్యేక గిన్నెలో, పిండి, బేకింగ్ సోడా, ఉప్పును కలిపి జల్లెడ పట్టండి. అరటిపండు మిశ్రమానికి క్రమంగా పొడి పదార్థాలను వేసి, పిండి మెత్తగా, బాగా మిక్స్ అయ్యే వరకు కలపండి. ఇవన్నీ బాగా కలిసే వరకు కలపాలి.

బ్రెడ్ పిండిలో తరిగిన నట్స్, చాక్లెట్ చిప్స్ లేదా డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలపాలి. తయారు చేసిన బ్రెడ్ లోఫ్ పాన్‌లో పిండిని పోసి సమానంగా విస్తరించేలా పోయాలి. ముందుగా వేడిచేసిన ఓవెన్‌లో సుమారు 60 నుంచి 70 నిమిషాలు దీనిని కాల్చండి. బనానా బ్రెడ్‌ బేక్‌ కాగానే ఓవెన్‌ నుంచి దించి పాన్‌లో 10 నుంచి 15నిముషాలు చల్లారిన తర్వాత ముక్కలుగా చేసి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2023-06-16T12:08:29+05:30 IST