Using phone in toilet: బాత్రూమ్‌లో కూడా ఫోనా..? ఇలా వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే చచ్చినా ఇంకోసారి తీసుకెళ్లరు !
ABN , First Publish Date - 2023-04-18T14:47:10+05:30 IST
కురుపులు, సైనసిటిస్ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.
మూత్ర విసర్జన చేస్తూ ఫోన్‌ని తీసుకెళ్లడం అనేది కొత్త అలవాటు, ఇది ఎక్కువగా యువతలో ఉంది. యువకులు టాయిలెట్ సీట్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ను వెంటతీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతారు. రీల్స్, బ్రౌజ్ చేయడం, వర్క్ మెయిల్‌లకు రిఫ్లయ్ ఇవ్వడం లాంటి పనులు చేయడంచేస్తారు. కానీ, టాయిలెట్ సీట్‌పై చేతిలో మొబైల్ ఫోన్‌ని పెట్టుకుని కూర్చోవడం వలన ప్రాణాంతకమైన వ్యాధికారక క్రిములు దాడి చేసే అవకాశం ఉంది.
ఈ అలవాటు ఎందుకు మానుకోవాలి?
టాయిలెట్ సీట్లు జెర్మ్స్ ఆవాసాలు. మనం టాయిలెట్ సీట్‌పై ఉండి, ఫోన్ స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు, మన చేతుల్లో చాలా సూక్ష్మక్రిములను మోసుకుపోతాము. నోరు, కళ్ళు, ముక్కులో చేరే అవకాశం కూడా ఉంది. నివేదికల ప్రకారం, క్రిములు మొబైల్ ఫోన్ స్క్రీన్‌లపై 28 రోజుల వరకు జీవించగలవట..
ఈ జెర్మ్స్ ఏమిటి?
టాయిలెట్ సీటుపై సాధారణంగా కనిపించే సూక్ష్మక్రిములు స్టెఫిలోకాకస్ ఆరియస్. టాయిలెట్ సీట్లపై ఉండే స్టెఫిలోకాకస్ ఇతర జాతులు కూడా మానవులకు హానికరం. ఇవి ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లకు కారణమవుతాయి. టాయిలెట్ సీటుపై ఈ కోలి, ఎంటరోకాకస్, సాల్మొనెల్లా, షిగెల్లా, క్యాంపిలోబాక్టర్‌లకు గురవుతారు.
ఇది కూడా చదవండి: ఎండా కాలం కదా అని కొబ్బరి బోండాలు తెగ తాగకండి.. రోజూ కొబ్బరి నీళ్లు తాగితే..
వచ్చే అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్‌లు ఏమిటి?
చాలా హానికరమైన వ్యాధికారక క్రిముల ప్రమాదంతో, కడుపు నొప్పి, అతిసారం, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ మొదలుకొని అనేక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. కురుపులు, సైనసిటిస్ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఎలా హాని చేస్తుంది?
టాయిలెట్ సీట్‌పై ఫోన్‌తో కూర్చోవడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువసేపు కూర్చుంటారు. ఆరోగ్య నిపుణులు ఈ అలవాటుకు వ్యతిరేకిస్తున్నారు. టాయిలెట్ సీట్లపై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పురీషనాళంపై ఎక్కువ ఒత్తిడి పడటంతో హేమోరాయిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత చేతి పరిశుభ్రతను పాటించడం ఎంత ముఖ్యమో.. ఫోన్ పరిశుభ్రతను పాటించడం అంతే అవసరం. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోవాలి. అలాగే మరిన్ని రోగాల బారిన పడకుండా ఈ సమయంలో ఫోన్‌లకు దూరంగా ఉండాలి.