Teeth: అమ్మ బాబోయ్.. ఇదేంటి..? వాంతి చేసుకుంటోంటే ఈ యువతికి పళ్లన్నీ ఊడిపోవడమేంటి..? అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2023-07-03T12:42:54+05:30 IST
పూర్తిగా దంతాలను కోల్పోయి మామూలు స్థితికి రావడానికి కాస్త టైం పట్టిందట.
ఇప్పటి కాలంలో రకరకాల జబ్బులు, వ్యాధులు కనీసం ఎప్పుడూ విని కూడా ఉండని రోగాల భారిన పడుతున్నాం. ఇది సాధరణం అయిపోయింది. పైగా వయసుతో భేధం లేకుండా ఇలాంటి జబ్బులు రావడం నిజంగా దురదృష్టం. మామూలుగా గర్భధారణ సమయంలో వాంతులు సర్వసాధారణం, అయితే ఇది కూడా ఓ అరుదైన వ్యాధిలా మారిందట ఓ అమ్మాయికి. HG అని పిలువబడే హైపెరెమెసిస్ గ్రావిడరమ్, ప్రపంచవ్యాప్తంగా 1 శాతం మంది స్త్రీలకు మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయట. ఈ వ్యాధిలో, గర్భిణీ స్త్రీలు చాలా వాంతులు చేసుకుంటారు, దీనితో దంతాలు దెబ్బతింటాయి. UKలో నివసిస్తున్న లూయిస్ కూపర్‌కి కూడా ఇదే వ్యాధి సోకి ఆమె ఇబ్బంది పడింది. ఈ వ్యాధి కారణంగానే తన దంతాలను కోల్పోయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. విషయంలోకి వెళితే..
25 ఏళ్ళ లూయిస్ కూపర్, ఒక ఫ్రెంచ్ రిసార్ట్‌లో నానీగా పనిచేస్తుంది, ఆమె 2017లో మొదటిసారి గర్భవతి అయింది. గర్భం గురించి తెలుసుకున్న వారం తర్వాత, అనారోగ్యం పాలైంది. ఆమె హైపెరెమెసిస్ గ్రావిడరమ్ (HG) బాధితురాలిగా మారింది. అంటే ఈ వ్యాధి లక్షణాల కారణంగా లూయిస్ తరచుగా వాంతులు చేసుకోవడం వల్ల, తన పళ్ళు ఊడిపోవడం ప్రారంభించాయి. మొదటి బిడ్డ నవంబర్ 2017లో పుట్టిన తర్వాత మొత్తం దంతాలన్నీ తీయించుకోవలసి వచ్చింది. అప్పటికే దంతాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి.
యాసిడ్ వాంతి
వాంతి యాసిడ్ వల్ల దంతాలకు నష్టం జరిగిందట. గర్భం దాల్చిన 16 వారాలలో మొదటి పంటిని కోల్పోయింది లూయిస్. పన్ను హఠాత్తుగా విరిగిపోయింది. దీని తర్వాత, దంతాలు దెబ్బతినడం ప్రారంభించాయి. గర్భం దాల్చిన చాలా కాలం ఆమె మంచానికే పరిమితమైంది, ఏది తింటే అది వాంతి రూపంలో బయటకు వచ్చేది.
ఇది కూడా చదవండి: పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ.. వానాకాలంలో వాడితే రిస్కే.. అసలు కారణమేంటంటే..!
దంతాలు లేని సాధారణ స్థితికి చేరుకుంది.
లూయిస్ తన మూడు గర్భాలలో హైపెరెమెసిస్ గ్రావిడరమ్ వల్ల ఇబ్బంది పడుతూనే ఉంది. శిశువు జన్మించిన తర్వాత HG వ్యాధి క్లియర్ అయింది. కాకపోతే దంతాలు లేకుండా ఉండటం లూయిస్ కి ఇబ్బందిగా మారిందట. గర్భం దాల్చిన సమయంలో ఏర్పడిన సమస్య బిడ్డను ప్రసవించాకా తగ్గడం కూడా విచిత్రమే. మళ్ళీ మరోసారి గర్భం దాల్చినపుడు మళ్ళీ సమస్య తిరిగి వచ్చేదట. అలా తిన్నది వాంతుల రూపంలో వెళిపోతూ దంతాలను కోల్పోతూ నరకం చూసింది లూయిస్. ఇప్పుడు పూర్తిగా దంతాలను కోల్పోయి మామూలు స్థితికి రావడానికి కాస్త టైం పట్టిందట. జనాల్లోకి అలా పళ్ళు లేకుండానే వెళ్ళడానికి అలవాటు పడిందట లూయిస్.
హైపెరెమెసిస్ గ్రావిడరమ్ ఒక బాధాకరమైన వ్యాధి
చాలా మంది దీనిని కీమో దుష్ప్రభావాలతో పోల్చారట. ఈ వ్యాధిలో చనిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇది మానసికంగా, శారీరకంగా అలసిపోయేట్టు చేస్తుంది.
హైపెరెమెసిస్ లక్షణాలు
1. తీవ్రమైన మూర్ఛ
2. నిరంతర వాంతులు
3. బరువు నష్టం
4. నిర్జలీకరణము లక్షణాలుగా ఉంటాయి.
హైపెరెమెసిస్ గ్రావిడరమ్ డైట్ చిట్కాలు
1. గర్భవతిగా ఉన్నప్పుడు తగినంత కేలరీలు, సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి.
2. ఆకలిగా ఉన్నప్పుడు తినాలి, అది ఎంత సమయం అయినా
చప్పగా ఉండే ఆహారాలకు మాత్రమే తీసుకోవాలి.
3. కొవ్వు పదార్ధాలను నివారించండి.
4. అధిక ప్రోటీన్ స్నాక్స్ ఎంచుకోవాలి.
5. ఎక్కువ కార్బోనేటేడ్ పానీయాలు త్రాగాలి.
6. తినే సమయంలో మింట్ లేదా అల్లంతో కూడిన హెర్బల్ టీలను తీసుకుంటే సరి.