Share News

Kuwait: కువైత్‌లో 107 మంది ప్రవాసులు అరెస్ట్

ABN , First Publish Date - 2023-10-14T11:08:38+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసుల (Expat) పై ఉక్కుపాదం మోపుతోంది.

Kuwait: కువైత్‌లో 107 మంది ప్రవాసులు అరెస్ట్

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసుల (Expat) పై ఉక్కుపాదం మోపుతోంది. అంతర్గత మంత్రిత్వశాఖ, రక్షణాధికారులు సంయుక్తంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తూ, ఉల్లంఘనదారులను అదుపులోకి తీసుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తొమ్మిది పనిమనుషుల రిక్రూట్‌మెంట్ చేసే కేంద్రాలలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఏకంగా 107 మంది ప్రవాసులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిలో చాలా మంది రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ తొమ్మిది కేంద్రాలు కూడా ఫేక్ అని తేల్చారు. అల్-అఖిలా, సల్వా, సెవిల్లే, ఫర్వానియా, ఖైతాన్, అల్-అహ్మది గవర్నెట్ పరిధిలలో చేసిన సోదాల్లో ఇలా భారీ మొత్తంలో ప్రవాసులు పట్టుబడ్డారు. అలాగే సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌లోని ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ ఓవర్‌సైట్ తనిఖీలలో ఆసియాకు చెందిన మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలను గుర్తించి తదుపరి చర్య కోసం చట్టపరమైన అధికారులకు అప్పగించారు.

US: గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే వార్త.. భారతీయులకు భారీ ప్రయోజనం


Updated Date - 2023-10-14T11:08:38+05:30 IST