Indian Citizenship: భారత పౌరసత్వాన్ని వదులుకున్న 16 లక్షల మంది.. పదేళ్ల రికార్డ్ బ్రేక్!

ABN , First Publish Date - 2023-02-10T09:50:38+05:30 IST

2011 నుంచి ఇప్పటివరకు 16లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని (Indian Citizenship) వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది.

Indian Citizenship: భారత పౌరసత్వాన్ని వదులుకున్న 16 లక్షల మంది.. పదేళ్ల రికార్డ్ బ్రేక్!

ఎన్నారై డెస్క్: 2011 నుంచి ఇప్పటివరకు 16లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని (Indian Citizenship) వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది. అత్యధికంగా గతేడాది 2.25 లక్షల మంది ప్రజలు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (External Affairs Minister S Jaishankar) రాజ్యసభలో వెల్లడించారు. గత పదేళ్లలో ఇదే అత్యధికమని ఆయన పేర్కొన్నారు. 2022లో అత్యధికంగా 2,25,620 మంది, 2020లో అత్యల్పంగా 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వీడినట్లు రాజ్యసభలో (Rajya Sabha) అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా 2011 నుంచి 2022 వరకు ఏడాది వారీగా పౌరసత్వాన్ని వీడిన భారతీయుల గణాంకాలను ఆయన తెలియజేశారు.

విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923 మంది, 2013లో 1,31,405 మంది, 2014లో 1,29,328 మంది, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఇక గతేడాది మాత్రం ఈ సంఖ్య 2,25,620కు పెరిగినట్లు తెలిపారు. దాంతో 2011 నుంచి 2022 వరకు భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య 16,63,440కు చేరిందన్నారు. మరోవైపు గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పౌరసత్వాన్ని పొందినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఇది కూడా చదవండి: రూ. 32 వేల కోట్లు కొట్టేసిన లేడీ కిలాడీ.. ఐదేళ్లుగా ఎఫ్‌బీఐ వేట.. ఇప్పుడు ఎక్కడ ?

అలాగే భారతీయులు పౌరసత్వం పొందిన 135 దేశాల జాబితాను కూడా ఆయన వెల్లడించారు. మరో ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ (Minister of State for External Affairs V Muraleedharan) మాట్లాడుతూ ఇటీవలి కాలంలో యూఎస్ కంపెనీలు వృత్తినిపుణులను తొలగించిన విషయం ప్రభుత్వానికి తెలుసు అని అన్నారు. వీరిలో కొంత శాతం మంది హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాలపై ఉన్న భారతీయులు ఉండే అవకాశం ఉంది. ఐటీ నిపుణులతో సహా అధిక నైపుణ్యం కలిగిన కార్మికుల తరలింపుకు సంబంధించిన సమస్యలను భారత ప్రభుత్వం అమెరికా సర్కార్‌తో నిరంతరం లేవనెత్తిందని ఆయన గుర్తు చేశారు. ఈ సమస్యలపై ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్, బిజినెస్ ఛాంబర్‌లతో సహా వివిధ వాటాదారులతో కూడా పని చేస్తోందని మురళీధరన్ చెప్పారు.

ఇది కూడా చదవండి: తెలుగు కుర్రాడి ప్రతిభకు అమెరికా సెల్యూట్.. సూపర్ టాలెంట్‌తో అబ్బురపరిచిన చిచ్చర పిడుగు!

Updated Date - 2023-02-10T10:31:28+05:30 IST