Kuwait: ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం.. 282 మంది ప్రవాసుల అరెస్ట్..!
ABN , First Publish Date - 2023-11-12T07:08:25+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. క్రమం తప్పకుండా వరుస తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో భాగంగా ఉల్లంఘనదారులను గుర్తించి వెంటనే దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన సుమారు 282 మంది ప్రవాసులు రెసిడెన్స్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (Residence Investigation Department) నిర్వహించిన తనిఖీలలో పట్టుబడ్డారు. వీరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖైతాన్, హవాలీ, అల్ దజీజ్, కబ్ద్ బ్రాయేహ్ సలేం, సాల్హియా, మహబౌలా, ఫహహీల్ మార్కెట్స్, ఫర్వానియా తదితర ప్రాంతాలలో ఈ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల జనరల్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన కీలక విభాగాల ఈ తనిఖీలు అమలు చేయడం జరగుతోంది.
UAE Golden Visa: యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసాతో బోలెడు బెనిఫిట్స్.. నివాసం నుంచి వ్యాపారం వరకు ప్రవాసులకు కలిగే ప్రయోజనాలివే..!
వీటిలో పరిశోధన మరియు పరిశోధన విభాగం, నియంత్రణ మరియు సమన్వయ విభాగం, ఆర్థిక మరియు పరిపాలనా సేవల విభాగం, త్రిసభ్య కమిటీ ఉన్నాయి. ఈ సంయుక్త సోదాలు రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించి దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న ప్రవాసుల (Expats) ను గుర్తించడమే లక్ష్యంగా కొనసాగాయి. ముఖ్యంగా రెండు నకిలీ గృహ కార్మిక కార్యాలయాలు, ఒక అక్రమ మసాజ్ ఇన్‌స్టిట్యూట్‌ను లక్ష్యంగా చేసుకుని సంబంధిత అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఇక అరెస్టైన 282 మంది ప్రవాసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. రెసిడెన్సీ నిబంధనల సమగ్రతను కాపాడుకోవడానికి, కార్మిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా నిబద్ధతను పాటించడానికి ఈ తనిఖీల ప్రచారకార్యక్రమం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా రెసిడెన్స్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేశారు.